తిన‘సోంపు’గా

• తిన‘సోంపు’గా…

భోజనం చేసిన వెంటనే చాలామంది సోంపు నోట్లో వేసుకోవడం చూస్తుంటాం. మరీ ముఖ్యంగా హోటల్‌కు వెళ్లినపుడు సుగర్‌కోటెడ్‌ సోంపు ఇస్తారు. ఎందుకో తెలుసా… మనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావడానికి. ఈ సొంపును చేపలు, చీజ్‌ బ్రెడ్‌, వెజిటబుల్‌ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వెజ్‌ కాకుండా నాన్‌వెజ్‌ కూరల్లో కూడా సోంపు పొడిని వాడతారు. కేక్స్‌, బిస్కట్స్‌, బ్రెడ్‌లలో కూడా ఉపయోగిస్తారు.

• ఆరోగ్య లాభాలెన్నో…!!

సోంపులో ఎనర్జీనిచ్చే గుణం ఉంది. పోషకాలు, యాంటాక్సిడెంట్లు, డైటరీ ఫైబర్‌, ఎసెన్షియల్‌ కాంపౌండ్లు ఉన్నాయి.

Related:   దాల్చినచెక్క

యాంటాక్సిడెంట్లు కాన్సర్‌, ఇన్ఫెక్షన్లు, ఏజింగ్‌, నరాలజబ్బుల నుంచి రక్షిస్తాయి.

ఆరోగ్యాన్ని పరిరక్షించే ఎన్నో ఎసెన్షియల్‌ ఆయిల్‌ కాంపౌండ్స్‌ వీటిలో ఉన్నాయి.

జీర్ణశక్తి మీద బాగా పనిచేస్తాయి.
కాపర్‌, ఐరన్‌, కాల్షియం, పొటాషియం,
మెగ్నీషియం వంటి ఖనిజాలెన్నో ఉన్నాయి.

విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్‌-ఎ, ఇ, సిలతో పాటు బికాంప్లెక్స్‌ విటమిన్లు కూడా ఉన్నాయి.

సోంపు నూనెను దగ్గు, బ్రాంకైటీస్‌ల నుంచి ఉపశమనం కోసం ఇస్తారు. కీళ్ల నొప్పులు తగ్గడానికి ఈ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తారు.

సోంపు వాడకం వల్ల బాలింతల్లో తల్లి పాలు
ఎక్కువగా స్రవిస్తాయి.

అయితే సోంపును మోతాదుకు మించి వాడటం మంచిది కాదు. సోంపు ఎక్కువ వాడితే మూర్ఛ, హాలోసినేషన్స్‌ వంటివి తలెత్తే ప్రమాదం ఉంది. సోంపును సమపాళ్లల్లో వాడితే శరీరం పోషకాలతో సమతుల్యంగా ఉంటుంది.

Related:   మలబద్దకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *