దాక్షారామం

 

తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ( దాక్షారామం ) సమీపం లో గల కోటిఫలి ( కోటిపల్లి ) , అక్కడ కోలువై ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ( శివుడు ) ని దర్శించుకుని తరిద్దాం .
నల్లనయ్య ఇక్కడ సిద్ది జనార్ధనిడిగా పూజలందుకుంటున్నాడు .
ఈ ప్రదేశం లో ఏపని చేసిన కోటి ఫలితాల్ని ఇస్తుందని చేబుతారు. ఎప్పుడు పట్నాల్లో ఉంటూ పచ్చటి పొలాలకు దూరంగా ఉంటూన్నవారికి కోటిపల్లి యాత్ర చిరకాలం గుర్తుండి పోతుంది . కాకినాడ నుంచి సుమారు 40 కిలోమీటర్లు దూరం కోటిపల్లి కి .

READ:   రోజు ఇంట్లో దీపం పెట్టెటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి?

40 కిలోమీటర్లు దూరం ఐనప్పటికిని ప్రయాణం సాగుతున్న కొద్ది ,రోడ్డు కి ఇరువైపులా కోబ్బరి చెట్లు , కనబడినంత దూరం లో పచ్చటి పోలాలు , అక్కడక్కడ రొయ్యల చెరువులు బస్సు వేగానికి చల్లటి గాలి వీస్తుంటే మన ప్రయాణం సాపీగా సాగుతుంది . మద్యలో కనబడే పల్లెటూర్లు , ఊరి పొలిమేర్లలో గ్రామా దేవతలు .. గొల్లపాలెం దగ్గరకు రాగానే బస్సు స్లో చేస్తారు గ్రామా దేవత పేరు ధనమ్మ తల్లి ఒకసారి దర్శనం చేసుకొని ముందుకు సాగాలి .

కోటిఫలి గౌతమీ నది ( గోదావరి ) ఒడ్డున ఉంది .
ఇచట గౌతమీ పుణ్య నదీలో విష్ణుతీర్ధ, రుద్రతీర్ధ,బ్రహ్మతీర్ధ,మహేశ్వర తీర్ధ,రామతీర్ధాది అనేక పుణ్య నదులు కోటి సంఖ్యలో అంతర్వహినులుగా ప్రవహించుచున్న కారణముగా ” కోటి తీర్ధ క్షేత్రము “గా ఖ్యాతి వహించినది .

READ:   ఈ రోజు శని అమావాస్య: జ్యేష్ఠ అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు

స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరును సోమగుండం అని పిలుస్తారు .

వ్యాస భగవానుడు రచించిన బ్రహ్మాండ పురాణములోని గౌతమీ మహాత్యములో ఈ కోటిపల్లి క్షేత్ర మహత్యముంది .

ఈ క్షేత్రము పూర్వకాలమున “కోటి తీర్ధము గాను” సోమ ప్రభాపురము ” గాను పిలువబడి నేడు “కోటిఫలి” మహాక్షేత్రముగా ఖ్యాతిపొంది విలసిల్లుచున్నది .

Originally posted 2018-02-20 11:21:51.