Home Health & Beauty దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

- Advertisement -

దాల్చిన చెక్క
****************

Cinnamon sticks or quills and ground cinnamon

దాల్చిన చెక్క (ఆంగ్లం Cinnamon) భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము. ఇది సిన్నమామం (Cinnamomum) అనే చెట్టు బెరడునుండి లభిస్తుంది.

దాల్చిన చెక్క , Cinnamon

దాల్చిన చెక్క అనగానే మషాలా వెంటనే జ్ఞాపకమొస్తుంది. బిరియాని తయారీలోనూ, మషాలా కూరలు తయారీలోనేగా దీని ప్రభావం ఉంటుందనేది అనే అభిప్రాయం అందరిలో ఉంది. కాని దానిలోనూ ఔషధ గుణాలున్నాయని కొందరికే తెలుస్తుంది. . దాల్చిన చెక్కకు సంస్కృతంలో ‘త్వక్’అనే పేరుంది. ‘దారుసితా’ (తియ్యని మాను కలిగినది అని అర్థం) అనేది కూడా దాల్చిన చెక్క పేరే. * తెలుగులో దాల్చిన పట్ట అనీ లవంగ పట్ట అనీ పిలుస్తారు. అయితే లవంగం చెట్టుకూ దాల్చిన చెట్టుకూ సంబంధం లేదు. * దాల్చిన చెట్టు మానునుంచి వలిచిన పట్టని ఎండబెట్టి దాల్చిన చెక్క పేరుతో మార్కెట్లో విక్రయిస్తుంటారు. * ‘బిర్యానీ ఆకు’ అనే పేరుతో మార్కెట్లో మనకు కనిపించేది ‘సిన్నమోమం తమాల’ (ఆకు పత్రకం) అనే చెట్టు ఆకులు. దాల్చిన ఆకులను తేజ్‌పత్ అంటారు.

దాల్చిన చెక్కను ఔషధంగా

పట్ట చూర్ణాన్ని 1-3 గ్రాముల మోతాదులోనూ, పట్టనుంచి తీసిన సుగంధ తైలాన్ని 2-5 బిందువుల మోతాదులోనూ ఉపయోగించాలి. * దాల్చిన చెక్కతో సితోపలాది చూర్ణం. త్వగాది లేహ్యం, త్వగాది చూర్ణం వంటి ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి. దాల్చిన చెక్కను సాధారణంగా కూరల్లో వాడడమేకాకుండా పొడి చేసుకుని నీళ్ళలో కలుపుకుని తాగితే మంచి ఫలితానిస్తుంది. వాత వ్యాధులలో దాల్చిన చెక్క చాలా బాగా పని చేస్తుంది. దీనిని వాడడం వలన కడుపులో వాతం బాగా తగ్గుతుంది. ఒక్కొక్కమారు పిల్లలు కల్తీ తినుబండారాలు లాగించాస్తారు. అవి విషతుల్యమైనవి. ఇందులోని విషప్రభావాన్ని తగ్గించేందుకు దాల్చిన చెక్క రసాన్ని తీసుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఒక్కొక్కమారు శరీరంలో నీరు అధికమవుతుంటుంది. ఇలాంటి సమయంలో దానిని తొలగించడానికి దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా తీసుకుంటే క్రమంగా ఉపశమనం లభిస్తుంది. పార్శ్వ నొప్పి అధికంగా ఉన్నవారు కాస్త దాల్చిన చెక్కను తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వరపేటిక వాపు, బొంగురు పోవడం వంటి వ్యాధులతోపాటు, గురగుర ఉన్నవారు చెక్కను దవడన పెట్టుకుని ఊటను మింగుతూ వస్తే అవన్నీ నయమయ్యే అవకాశం ఉంది. మహిళల్లోని రుతుదోషాల నివారణకు ఇది దివ్య ఔషదంలా పని చేస్తుంది. దీనిని తీసుకోవడం వలన రుతుస్రావం సరియైన సమయంలో జరిగేలా చేస్తుంది. గర్భదోషాలను కూడా మాయం చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. జిగట విరేచనాలను నియంత్రంచడానికి దాల్చిన చెక్కను ఉడకబెట్టి పేస్టు చేసి దానిలో దానిలో కాస్తనెయ్యి, పటికబెల్లం కలిపి తీసుకుంటే చాలు. విరేచనాలు తగ్గుతాయి. కొన్ని ఔషధ గుణాలు : చర్మం ముడతలు, రంగు తగ్గటం దాల్చిన చెక్క పొడిని, గంధం పొడినీ రోజ్‌వాటర్‌తో కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడిని ఒక స్పూన్ తేనెతో కలిపి ప్రతిరోజూ రాత్రిపూట తీసుకోవాలి. ఆమాశయపు క్యాన్సర్ రెండంగుళాల దాల్చిన చెక్క ముక్కను చిన్న చిన్న పేళ్లుగా విరిచి, ఒకటిన్నర కప్పుల నీళ్లకు కలిపి 10 నిమిషాలపాటు మరిగించి వడపోసి, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే పేగులకు, ఆమాశయానికి సంబంధించిన క్యాన్సర్లలో ఉపయుక్తంగా ఉంటుంది. మొటిమలు, బ్లాక్‌హెడ్స్ దాల్చిన చెక్క పొడిని, నిమ్మ రసాన్ని ముద్దగా కలిపి మొటిమల మీద ప్రయోగిస్తే జిడ్డు తగ్గి త్వరగా మాడిపోతాయి. రక్తహీనత పావు చెంచాడు దాల్చిన చెక్క పొడిని అర కప్పు దానిమ్మ రసానికి కలిపి, అర చెంచాడు తేనె కలిపి తీసుకుంటూ ఉంటే రక్తం పెరుగుతుంది. అజీర్ణంవల్ల విరేచనాలు దాల్చిన చెక్క పొడి, శొంఠి పొడి, జీలకర్ర పొడిని సమభాగాలు కలిపి అర టీస్పూన్ మోతాదులో తేనెతో రెండుపూటలా తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి, విరేచనాలు తగ్గుతాయి.

ముక్కుదిబ్బడ
***************
దాల్చిన చెక్క మిరియాలు, ఏలక్కాయాలు, నల్ల జీలకర్ర (కలౌంజి)లను సమంగా తీసుకొని పొడిచేసి చర్ణనస్యంగా పీల్చితే కఫం తెగి, గాలి ధారాళంగా ఆడుతుంది. జలుబు దాల్చిన చెక్క, మిరియాలు సమంగా తీసుకొని నూరి, కషాయం తయారుచేసుకొని తాగితే జలుబులో హితకరంగా ఉంటుంది. నిద్ర పట్టకపోవటం అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక టీ కప్పు నీళ్లకు కలిపి ఐదు నిమిషాలు మరిగించి తేనె కలిపి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగితే గాఢమైన నిద్ర పడుతుంది. పంటి నొప్పి దాల్చిన నూనెలో దూదిని ముంచి దంతాల మీద ఉంచుకుంటే పంటి నొప్పి నుంచి ఉప శమనం లభిస్తుంది. దంతాలమీద మరకలు దాల్చిన ఆకులను మెత్తగా నూరి, పండ్లపొడి తయారుచేసుకొని వాడితే దంతాలు మిలమిల మెరుస్తాయి. ఇన్‌ఫ్లుయంజా (ఫ్లూజ్వరం) దాల్చిన చెక్క మూడున్నర గ్రాములు, లవంగాలు 600 మిల్లీగ్రాములు, శొంఠి 2గ్రాములు తీసుకొని ఒక లీటర్ నీళ్లలో వేసి మరిగించాలి. పావు లీటర్ కషాయంగా మారిన తరువాత వడపోసి పూటకు 50 మిల్లీలీటర్ల మోతాదులో (అరకప్పు) మూడుపూటలా తీసుకుంటే వైరస్ కారణంగా వచ్చే జ్వరం త్వరితగతిన తగ్గుతుంది. కర్ణస్రావాలు (చెవినుంచి చీము కారటం) దాల్చిన నూనెను దూదితో తడిపి మూసిన కనురెప్పల మీద ప్రయోగిస్తే నేత్రాల నొప్పి తగ్గి ప్రకాశవంతంగా తయారవుతాయి. కళ్లు అసంకల్పితంగా కొట్టుకోవటం వంటి సమస్యలు తగ్గుతాయి.

దాల్చిన చెక్క – మధుమేహ వ్యాధి నివారణ
*************************
టైప్2 మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెరల నియంత్రణకు దాల్చినచెక్క బాగా ఉపయోగపడుతోందని కాలిఫోర్నియాలోని వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. పరిశోధనలో భాగంగా.. 543 మంది టైప్2 మధుమేహ రోగుల్లో కొంతమందికి దాల్చినచెక్కను రోజుకు 120 మిల్లీగ్రాముల నుంచి 6 గ్రాముల వరకూ మాత్రల రూపంలో ఇచ్చారు. మరికొంత మందికి నకిలీ మాత్రలు ఇచ్చారు. తర్వాత ఫలితాలను పరిశీలించగా.. దాల్చిన చెక్క మాత్రలు తీసుకున్నవారి రక్తంలో చక్కెరల స్థాయి మిగతావారికన్నా మెరుగ్గా నియంత్రణలో ఉన్నట్లు తేలింది. ఇన్సులిన్ హార్మోన్ విడుదల, పనితీరును దాల్చినచెక్క ప్రభావితం చేయడం వల్లే చక్కెరల స్థాయి మెరుగుపడుతున్నట్లు గుర్తించారు. అలాగే చెడు కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్)ను, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంతోపాటు మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచడంలో కూడా దాల్చినచెక్క దోహదపడినట్లు గమనించారు. అయితే టైప్2 మధుమేహ రోగులకు కచ్చితంగా ఎంత మోతాదు దాల్చినచెక్కను ఇవ్వాలన్న దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

దగ్గు.
************
దాల్చిన ఆకుల (తేజ్‌పాత్) చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదుగా రెండు చెంచాలు తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. తల నొప్పి దాల్చిన నూనె గాని లేదా దాల్చిన చెట్టు ఆకుల పొడిని గాని లలాట భాగం మీద ప్రయోగిస్తే జలుబువల్ల గాని లేదా వేడివల్ల గాని వచ్చిన తల నొప్పి తగ్గుతుంది. ఎక్కిళ్లు దాల్చిన చెక్క కషాయం అర కప్పుకి 250 మిల్లీగ్రాముల రుమీ ముస్తగీ జిగురును కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి. రాజయక్ష్మ (ట్యుబర్కులోసిస్) దాల్చిన చెక్క తైలాన్ని అల్ప మాత్రలో అనునిత్యం తీసుకుంటుంటే క్షయ వ్యాధిలో సహాయక చికిత్సగా పనిచేస్తుంది. ప్రసవానంతరం వచ్చే నొప్పి(ప్రసవపీడ) ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడికి ఒక గ్రాము పిప్పళ్ల వేరు చూర్ణం, 500 మిల్లీగ్రాముల గంజాయి ఆకుల పొడి కలిపి తీసుకుంటే ప్రసవానంతరం టెండాన్లలో చోటుచేసుకున్న శైధిల్యం తగ్గి కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పి (సంధివాతం) 30గ్రాముల దాల్చిన చెక్క పొడికి 30 గ్రాముల తేనె కలిపి పేస్టు మాదిరిగా తయారుచేసి సున్నితంగా కీళ్లమీద మర్ధించాలి. అలాగే 2 గ్రాముల దాల్చిన చెక్క పొడిని, ఒక చెంచాడు తేనెకు కలిపి మూడుపూటలా కడుపులోపలకూ తీసుకుంటూ ఉంటే కీళ్లనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తస్రావం దాల్చిన చెక్కతో గాని లేదా దాల్చిన చెట్టు ఆకులతో గాని (తేజపత్రాలు) కషాయం తయారుచేసి తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలు ఆగిపోతాయి. ముక్కునుంచి రక్తం కారటం, మహిళల్లో మాసాను మాసం అధికమొత్తాల్లో రక్తస్రావం కావటం వంటి సందర్భాల్లో ఈ గృహ చికిత్స చాలా లాభప్రదంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఆధిక్యత 3 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిని, 2 టీస్పూన్ల తేనెనూ ఒక టీ కప్పు నీళ్లకు కలిపి రోజుకు 3సార్లు విభజించి తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. మలబద్ధకం దాల్చిన చెక్క పొడి 500మి.గ్రా., శొంఠి పొడి 500మి.గ్రా., ఏలక్కాయల పొడి 500 మి.గ్రా. కలిపి భోజనానికి ముందు ఉదయ సాయంకాలాలు తీసుకుంటే మలబద్ధకం వంటి జీర్ణక్రియా సమస్యల్లో లాభప్రదంగా ఉంటుంది. పేగుల శబ్దాలు (ఆంత్రకూజనాలు) దాల్చిన చెక్కనుంచి తీసిన తైలాన్ని ఉదర భాగం మీద ప్రయోగించి మర్ధనా చేసుకుంటే పేగుల శబ్దాలు తగ్గుతాయి. విరేచనాలు నాలుగు గ్రాముల దాల్చిన చెక్క పొడిని 10గ్రాముల ఖదిర సారాన్ని (కాచు) పావు లీటరు వేడి నీళ్లకు కలిపి 2గంటలు నానబెట్టి, ద్రవాన్ని మాత్రం వడపోసి తీసుకుంటే విరేచనాలు ఆగిపోతాయి. వాంతులు దాల్చిన చెక్క (10గ్రాములు), లవంగాలు (5గ్రాములు) పరిమాణంగా తీసుకొని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసుకొని తాగితే వాంతులు తగ్గుతాయి. అతిసారం మారేడు పండ్ల షర్బత్‌కి అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే నీళ్ల విరేచనాలు ఆగిపోతాయి. కడుపునొప్పి దాల్చిన చెక్కనుంచి తీసిన తైలాన్ని టీ స్పూన్ మోతాదుగా రెండు టీ స్పూన్ల పటిక బెల్లం (మిశ్రీ) కలిపి తీసుకుంటే ఉదర శూల తగ్గుతుంది. చర్మవ్యాధులు, దురద, పొక్కులు దాల్చిన చెక్క పొడికి తేనె కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మవ్యాధుల్లో ఉపశమనము కలుగును.

Originally posted 2019-02-24 11:46:27.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

డిసెంబరులో సందర్శించడానికి భారతదేశంలోని 8 విశ్రాంతి బీచ్‌లు

బీచ్ ప్రకృతితో సంబంధం. మానవుడు తన జీవితంలో వచ్చే ఆనందాన్ని పంచుకోవడం అసాధారణం కాదు. ప్రకృతిని ఇష్టపడే పర్యాటకులు చాలా మంది ఉంటారు. చల్లని మరియు విశ్రాంతి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తులు...
- Advertisement -

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...

Related News

డిసెంబరులో సందర్శించడానికి భారతదేశంలోని 8 విశ్రాంతి బీచ్‌లు

బీచ్ ప్రకృతితో సంబంధం. మానవుడు తన జీవితంలో వచ్చే ఆనందాన్ని పంచుకోవడం అసాధారణం కాదు. ప్రకృతిని ఇష్టపడే పర్యాటకులు చాలా మంది ఉంటారు. చల్లని మరియు విశ్రాంతి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తులు...

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...

ApploadYou – Create your apps!

Product Name: ApploadYou - Create your apps! Click here to get ApploadYou - Create your apps! at discounted price while it's still available... All orders are...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here