దాశరథీ శతకమునుండి ఓ పద్యము

*దాశరథీ శతకమునుండి ఓ పద్యము..*🌹

*రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ*
*స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద*
*శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో*
*ద్ధామ విరామ భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ!*

*భావం: జనులను సంతోషింపజేయువాడవు, పరశురాముని జయించినవాడవు, పరస్త్రీ లయందాసక్తి లేనివాడవు, నల్లని మేఘమువంటి శరీర కాంతిగలవాడవు, కాకుత్స వంశమను సముద్రమునకు చంద్రునివంటి వాడవు, రాక్షసుల సంహరించిన వాడవునైన భద్రాచల రామా!*

*శ్రీ రామచంద్రం భజామ్యహం!!!*🌹🙏🌸

Related:   Premium URL Shortener - isrturl.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *