నవవిధ భక్తులు

0
163

నవవిధ భక్తులు
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం.

ఇవి శ్రీమద్భాగవతాంతర్గతముగా చెప్పబడిన భక్తిమార్గములు .

శ్రీమదాంధ్రభాగవతం లో పోతన గారు దీని యొక్క ఆంధ్రానువాదం చేస్తూ ఈ క్రింది పద్యాన్ని ఇచ్చారు.

తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బనునీతొమ్మిదిభక్తిమార్గముల సర్వాత్మునున్ హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

1. భగవంతుని లీలలను వినడం (“శ్రవణం”)
2. ఆయన లీలలను “కీర్తించడం”
3. అదే పని గా భగవంతుని నమ”స్మరణ” చేయడం
4. స్వామివారి “పాదసేవనము” చేయడము
5. స్వామిని “అర్చించడం”
6. భక్తి తో “వందనము” చేయడము
7. దాస భక్తి తొ స్వామికి దాసుడ ననే భావము తో “దాస్యము” చేయడం
8. స్వామి నా చెలికాడు అనే భావన తో “సఖ్యము” చేయుట
9. స్వామీ నీవే నా సర్వస్వము , ఈ మనో వాక్కాయములు ఉన్నది నీ కొరకే అనే భావన తో “ఆత్మ నివేదన” చేయడం

Also READ:   రోజు ఇంట్లో దీపం పెట్టెటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి?

ఈ తొమ్మిందింటినీ నవవిధ భక్తులు అని అంటారు . ఈ నవవిధ భక్తులలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనం స్వామిని పొంది పునరావ్రుత్తి రహిత స్థితి ని పొందవచ్చు.

ఇక్కడ ఒక్కో భక్తి మార్గం లో తరించిన మహానుభావుల గూర్చి మనం తెలుసుకోవాలి.
1. శ్రవణం —– పరీక్షిత్ మహారాజు (భాగవతాన్ని (భగవత్ భక్తుల కధలను)విని తరించాడు )
2.కీర్తనం —– శుక బ్రహ్మ (భాగవతాన్ని చెప్పి తరించిన మహనీయుడు) .
3.స్మరణం —– ప్రహ్లాదుడు .(ఎప్పుడూ స్వామి నామం చెప్తూ తరించిన మహనీయుడు)
4.పాదసేవనం — లక్ష్మీదేవి (అమ్మ గూర్చి ఏమని చెప్పేది.. అమ్మ భక్తి తెలియనిదెవరికి )
5.అర్చనం —— పృధు మహారాజు (ఈయన కధ కూడా భాగవతం లో వస్తుంది.)
6.వందనం——- అక్రూరుడు (భాగవతం లో దశమస్కంధం లో శ్రీ కృష్ణ బలరాములను కంసుని వద్దకు తీసుకు వెళ్ళడానికి వస్తాడు అక్రూరుడు , శ్రీ కృష్ణుని పరమ భక్తుడు ,ఈయన చేసే వందనానికి శ్రీ కృష్ణుదు పొంగిపోయాడంటే ఎంత గొప్పవాడో మనం అర్ధం చేసుకోవాలి.)
7.దాస్యం —— ఆంజనేయ స్వామి (స్వామి హనుమ యొక్క దాస భక్తి ,వారు శ్రీ రామ చంద్రమూర్తి ని సేవించిన తీరు , తెలియని వారు ఉండరు)
8.సఖ్యం —— అర్జునుడు (శ్రీ కృష్ణార్జునల బంధము లోకవిహితమే కదా)
9.ఆత్మనివేదనం — బలిచక్రవర్తి (వామనావతరం లో స్వామికి మూడడుగుల నేల దానమిచ్చి మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే తన శిరస్సుని చూపి స్వామికి తనని తాను సమర్పించుకొని తరించిన మహనీయుడు. )

Also READ:   బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here