నానబెడితే So .. Better..‌!

• నానబెడితే So .. Better..‌!

బాదం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. కాకపోతే, ఎండువి తినాలా?
నానపెట్టినవి తినాలా? అంటే… ఎవరికి తోచింది వారు చెబుతుంటారు. శాస్త్రీయంగా చూస్తే నానపెట్టినవే ఉత్తమమనే విషయం స్పష్టమవుతోంది.

* ఏ పద్ధతిలో…

అరకప్పు నీళ్లల్లో పిడికెడు బాదం గింజలు వేసి 8 గంటల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత వాటి మీద పొట్టు తొలగించి, వాటిని ప్లాస్టిక్‌ కంటేనర్‌లో నిలువ చేసుకోవాలి. ఇవి వారం రోజుల దాకా తాజాగానే ఉంటాయి.

READ:   Relentlessly Creative Books

* వీటివల్ల కలిగే ప్రయోజనాల్లో ప్రధానంగా……

నానవేసిన బాదం గింజల్లోంచి విడుదలయ్యే ఎంజైములు జీర్ణశక్తిని పెంచుతాయి. ప్రత్యేకించి, వీటిలోని లిపేస్‌ ఎంజైములు, కొవ్వు సైతం జీర్ణమయ్యేలా చేస్తాయి.

వీటిలోని పేరుకునే గుణం లేని మోనో-సాచురేటెడ్‌ ఫ్యాట్స్‌, తొందరగా కడుపునిండిన అనుభూతిని కలిగించి, తక్కువ తినేలా చేస్తాయి. పరోక్షంగా, చిరుతిండ్ల మీదికి మనసు పోకుండా కూడా చేస్తాయి.

వీటిల్లో చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డిఎల్‌) ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డిఎల్‌) ను పెంచే గుణాలున్నాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

READ:   భార్య‌ని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లిన అక్ష‌య్ కుమార్ ఎందుకంటే - Fun Jio

నానవేసిన బాదం గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక ప్రధాన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసే ఇ-విటమిన్‌, అకాల వృద్ధాప్యానికి దారి తీసే హానికారక ఫ్రీ ర్యాడికల్స్‌ను నియంత్రిస్తుంది.

బాదంలోని బి-17 కేన్సర్‌తో పోరాడే శక్తినిస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్‌కు కణుతుల పెరుగుదలను అడ్డుకునే శక్తి ఉంది.

గ్లూకోజ్‌ నిలువల్ని నియత్రించడం ద్వారా మధుమేహాన్ని, ఒత్తిళ్లను తగ్గించడం ద్వారా అధిక రక్తపోటును అదుపు చేసే అంశాలు బాదం లో సరిపడా ఉన్నాయి.

నీటిలో నానవేసిన బాదం గింజల్లోని ఫోలిక్‌ యాసిడ్‌లో పుట్టుకతో వచ్చే కొన్ని రకాల లోపాలను నియంత్రించే శక్తి కూడా ఉంది.

READ:   వెబ్ సిరీస్ లో తెలుగు స్టార్ హీరో... - Fun Jio

Originally posted 2018-02-21 20:59:39.