నాన్నా

రమేష్ ఒక టైలర్ కొడుకు B.Tech చదువుతున్నాడు. చాలా డిప్రషన్లో ఉన్నాడు. తనకంటే తక్కువ మార్కులు తెచ్చుకపంటున్న శ్రీమంతుల పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, బైక్, కొందరికి కార్లు ఉన్నాయి. తనకే కనీసం మంచి ఫోనైనాలేదు. స్నేహితులముందు అవమానంగా ఉంది. స్నేహితులు చులకనగా చూస్తున్నారు. తన కనీస కోర్కెలు తీర్చలేనివాడు నాన్నకు పెళ్ళెందుకూ, పిల్లలెందుకు. కోపంతో ఊగిపోయాడు. ఈ అవమానంతో బతికేకంటే చద్దామని నిర్ణయించుకున్నాడు.
తలుపు తీసుకుని బయటకు వస్తుంటే అమ్మానాన్న మాటలు వినబడు తున్నాయి. ఒక్కక్షణం నిలబడి విన్నాడు.
తల్లి :- బాగాదగ్గు తున్నారు. డాక్టరు వద్దకు వెళ్ళి చూపించుకోవచ్చుగా?
తండ్రి:- చూపించాను. TB అన్నారు. వైద్యానికి పది పదిహేను వేలౌతాయన్నారు.
తల్లి:- ఈనెల్లో చీటీవస్తుంది కదా చూపించుకోండి.
తండ్రి:- ఆడబ్బు అబ్బాయి సెల్ కోసంకేటాయించాను.
తల్లి:- మీఆరోగ్యం కంటే వాడి ఫోన్ ముఖ్యమా?
తండ్రి:- నీకు నేను ముఖ్యం. నాకు వాడు ముఖ్యం. వాడి కోర్కెలేవీ తీర్చలేక పోతున్నాం. కనీసం ఇదైనా తీర్చకుంటే ఎలా?
తల్లి:- మరిమీ ఆరోగ్యం?
తండ్రి:- మనకింకెన్నాళ్ళే కష్టాలు? ఇంకోరెండేళ్ళలో వాడిచదువు పూర్తి ఐపోతుంది. నన్నూ నిన్ను అసలు పనిచేయనీయడు. మంచిగా చూసుకుంటాడు. అప్పుడు నువ్వు రాజమాత నేను వృద్ధరాజు. దర్జాగా బతికేద్దాం.
రమేష్ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. ఎంత ఆశ పెట్టుకున్నావ్ నాన్నా! నీ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి నాకు ఫోన్ కొందామనుకున్నావా? మరి నేనేమో నిన్ను వంటరిచేసి పోదామనుకున్నాను. ఎంత ద్రోహం. నాకు ఫోన్ వద్దు. నీ ఆరోగ్యమే ముఖ్యం. నేను బాగా చదువుతా క్యాపస్ ఉద్యోగం సంపాదిస్తా నిన్ను రాజులాగా చూసుకుంటా అనుకుని గదిలోకెళ్ళి పడుకున్నాడు. రేపే నాన్నను ఒప్పించి డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళాలి అని అనుకుంటూ తృప్తిగా నిద్రపోయాడు.
నోట్:- ఇది మీకు తెలిసిన కుర్రాళ్ళకందరికీ పంపండి ప్లీజ్…

Related:   Cute story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *