నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్

నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్

క్షేత్ర మహిమ:

వివాహం ఆలస్యమవుతున్న వారు, వివాహ విషయాల్లో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు ఈ క్షేత్ర దర్శనం తో వివాహం జరుగుతుంది

ఈ క్షేత్రాన్ని దర్శించి క్రింది విధంగా చేయాలి.

కోమలవల్లి సమేత వరాహ స్వామీ వారు కొలువైన క్షేత్రం ఈ నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్.

1. వివాహం కోసం ఇక్కడకు వచ్చే భక్తులు రెండు పూల మాలలు ఆలయం లో దేవుడికి సమర్పించాలి. (పూల మాలలు గుడి ఎదురుగా ఉన్న దుకాణాల్లో లభిస్తాయి)

READ:   గిరి వలయం, తిరువన్నామలై

2. గోత్ర నామాలతో అర్చన చేసిన పిదప అందులో ఒక మాల ను పూజారి గారు తిరిగి భక్తుడి మెడలో వేస్తారు.

3. ఆ మాల ధరించిన భక్తుడు 9 ప్రదక్షిణాలు చేయాలి. తదుపరి కోమలవల్లి అమ్మవారిని దర్శించి కుంకుమను తీసుకోవాలి.

అలా చేసిన 3 నుంచి 6 నెలల్లో వివాహం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వివాహం అయిన తదుపరి దంపతులిద్దరూ వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి.

దర్శన వేళలు : ఉదయం6.00 నుంచి మధ్యాహ్నాం 12.00 వరకు

READ:   వారణాసి భూగృహంలో ఉగ్ర వారాహీ విచిత్ర దేవాలయం

సాయంత్రం 3.00 నుండి రాత్రి 8.00 వరకు

ఎలా చేరుకోవాలి :

చెన్నై నుంచి 45 kms
మహాబలిపురం వెళ్లే బస్సులన్ని ఈ క్షేత్రం మీదుగానే వెళ్తాయి

చిరునామా

నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్,
తిరువిడెంతై ( THIRUVIDANTHAI)
కాంచీపురం dist
తమిళనాడు

Originally posted 2018-06-11 19:59:10.