నిమ్మకాయ చారు

0
107

Please View My Other Sites

చింతపండు కె. జి . రు.300 /- దాటింది .

మాకు నిత్యం చారు కాని పులుసు కాని రెండు పూటలా కావాలి .

మరి కొంతవరకైనా చింతపండు ఖర్చు అదుపు చేయాలంటే ప్రత్యామ్నాయం నిమ్మకాయ చారు .

నిమ్మకాయ చారు .

ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోండి .

Also READ:   వంకాయ మెంతి ఉల్లికారం

అందులో పావు స్పూను పసుపు వేయండి .

రెండు పచ్చిమిర్చి ముక్కలుగా చేసి వేయండి .

రెండు రెమ్మల కరివేపాకు వేయండి .

తగినంత ఉప్పు వేయండి .

రెండు నిమ్మకాయలు కోసి వేరే కప్పులో రసం తీసుకోండి .

రెండు ఎండు మిరపకాయలు , స్పూను ధనియాలు , పావు స్పూను జీలకర్ర , నాలుగు మిరియాలు రోట్లో దంచుకోండి .
లేదా మిక్సీ లో పొడి వేసుకోండి .

చారుపొడి ఇంట్లో రెడీగా ఉంటే ఆ పొడి స్పూనున్నర వేసుకోవచ్చు .

అప్పుడు రసం పొడి కొట్టు కోనక్కర లేదు ,

Also READ:   సగ్గు బియ్యము వడలు

ఇప్పుడు స్టౌ మీద చారు గిన్నె పెట్టి బాగా మరగ నివ్వండి .

అందులో నే చెప్పిన కొట్టిన పొడి గాని లేదా చారు పొడి గాని వేయండి .

బాగా కాగనిచ్చి దింపి పిండిన నిమ్మరసం అందులో పోసి గరిటతో బాగా కలపండి .

స్టౌ మీద కాగుతూ ఉండగా నిమ్మరసం పోస్తే చారు చేదు వస్తుంది .

కొత్తిమీర తరిగి అందులో వేయండి .

ఇప్పుడు స్టౌ మీద పోపు గరిటె పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే రెండు ఎండుమిర్చి ముక్కలు , కొద్దిగా మెంతులు , కొద్దిగా జీలకర్ర , పావు స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టుకోండి .

Also READ:   నిమ్మకాయ కారం. రోటి పచ్చడి

అంతే వేడి వేడి నిమ్మరసం తో చారు సిద్ధం .

మీకు హోటల్ చారు రుచి రావాలంటే పొడిలో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దంపుకోండి .

అప్పుడు పోపులో ఇంగువ వేయవద్దు .