నీకు సిగ్గుందా.. హీరోయిన్‌పై స్నేహ భర్త కామెంట్

0
38


ప్రముఖ నటి స్నేహ భర్త ప్రసన్న.. నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌పై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరలక్ష్మి శరత్‌కుమార్ సినిమాలు ఇతర హీరోయిన్లు నటించేదాని కంటే భిన్నంగా ఉంటాయి. విలన్ అంటే ఎవరికైనా మగవాడే గుర్తొస్తాడు. కానీ విలన్ గెటప్స్ మేం కూడా వేసి చూపిస్తాం అని నిరూపించారు వరలక్ష్మి. ఎన్నో సినిమాల్లో ఆమె మగరాయుడిలా విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో ‘నాంది’ అనే సినిమాలో నటిస్తున్నారు.


ఇందులో అల్లరి నరేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. లుక్‌లో నరేష్ న్యూడ్ గెటప్‌లో కనిపించారు. అయితే ఈ సినిమాలో తన లుక్‌ను వరలక్ష్మి ట్విటర్‌లో షేర్ చేసారు. బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో చీర కట్టులో సిగ్గుపడుతూ చాలా అందంగా కనిపించారు. ఈ లుక్‌ని షేర్ చేస్తూ.. ‘అప్పట్లో అలా సిగ్గుపడుతుండేదాన్ని’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నటుడు ప్రసన్న కామెంట్ చేస్తూ.. ‘సిగ్గా? నీకా? నీకు సిగ్గు కూడా ఉందా?’ అన్నాడు. ఇందుకు వరలక్ష్మి రిప్లై ఇస్తూ.. ‘అందుకే అప్పట్లో అని పేర్కొన్నాను’ అన్నారు. ‘నిబునన్’ అనే తమిళ సినిమాలో వరలక్ష్మి, ప్రసన్న కలిసి నటించారు.

Also READ:   ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సొంత కుంపటి.. ఆ బ్యానర్‌ను పక్కన పెట్టేసి త్రివిక్రమ్‌తో..

Please View My Other Sites

READ ALSO:
అనసూయపై వల్గర్ ట్వీట్… అందులో తప్పేముంది అంటున్న ట్విటర్ అధికారులు

వరలక్ష్మి ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఆమె విలన్ పాత్ర పోషించారు. అంతేకాదు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ సినిమాలోనూ వరలక్ష్మి జయమ్మ అనే పాత్రలో నటిస్తున్నారు.

See Photo Story:
లవ్ అనేది ఓ యూనివర్సల్ ఫీలింగ్: రాశీఖన్నా

Also READ:   నాగ శౌర్య చేతులు కాల్చుకుంటున్నాడా..ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు..!! - Pakka Filmy - Telugu