Home Health & Beauty నెలసరి పొత్తి కడుపు నొప్పిని తగ్గించే చిట్కాలు

నెలసరి పొత్తి కడుపు నొప్పిని తగ్గించే చిట్కాలు

- Advertisement -

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
నెలసరి పొత్తి కడుపు నొప్పిని తగ్గించే చిట్కాలు!

మహిళలను ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్య నెలసరి. చాలా మంది స్త్రీలు రుతుస్రావం సమయంలో కడుపు నొప్పి, నడుం నొప్పితో బాధపడుతుంటారు. నాలుగు రోజులపాటు తీవ్ర వేదన అనుభవిస్తారు. నెలసరి వచ్చినప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా కడుపు నొప్పి, మాటిమాటికీ కోపం రావడం, చిరాకు అధికమవుతాయి.
పీరియడ్స్ రావడానికి 14 రోజుల ముందు అండం విడుదల అవుతుంది. కానీ అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం పీరియడ్స్ సమయంలో బయటకు వెళ్లిపోతుంది. చాలామందికి ఈ టైమ్‌లో పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. కానీ కొందరిలో నొప్పి అధికంగా ఉంటుంది. అలాంటి వారు కింది జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నొప్పి తగ్గించొచ్చు.

పీరియడ్స్ రావడానికి ముందు బొప్పాయి పండు తినడం ఉపకరిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ప్లేమటరీ గుణాలు ఉంటాయి. ఐరన్, కాల్షియంతోపాటు విటమిన్ ఎ, విటమిన్ సి కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి సంకోచించిన పొత్తి కడుపు కండరాలను తిరిగి సాధారణ స్థితికి తెస్తాయి.
ఆధ్మాతికంగా, ఆరోగ్య పరంగా తులసికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పీరియడ్స్ టైంలో నొప్పి తగ్గడానికి ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. తులసి ఆకుల్ని కప్పు నీటిలో కలిపి వేడి చేయాలి. తర్వాత దాన్ని చల్లార్చి కొద్ది కొద్దిగా రెండు మూడు గంటలకోసారి తాగాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది.

అల్లం తురుమును కప్పు నీటిలో కలిపి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత దాన్ని వడగట్టి తగినంత నిమ్మ రసం, తేనె కలపాలి. పీరియడ్స్ టైంలో రోజుకు రెండు మూడు సార్లు తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది

Originally posted 2018-07-19 17:03:36.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

ఆలు గోబి కూర

కొంచెం వెరైటీగా క్యాలీ ఫ్లవర్ బంగాళా దుంప కూర. ( ఆలు గోబి కూర. ) తయారీ విధానము . ఒక అరకిలో క్యాలీఫ్లవర్ గోరు వెచ్చని నీటిలో విడదీసి వేసుకుని సన్నగా ముక్కలు తరుగుకుని...
- Advertisement -

దర్శకుడిపై నాగార్జున ఆగ్రహం.. కొడుకు కోసం ఆ రేంజ్‌లో ఫైర్! | Nagarjuna angry on geetha govindam director parasuram

<!----> దర్శకుడిపై అసహనం.. చాలా మంది దర్శకులకు నాగ్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి వారి సినీ కెరీర్ కి ఎంతో...

లవంగాలు (Cloves, Lavangaalu (Cloves)

లవంగాలు (Cloves, Lavangaalu (Cloves) ************************ లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాదు. విలువైన పోషకాలు ఉన్నాయి . ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్,...

Related News

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క **************** Cinnamon sticks or quills and ground cinnamon దాల్చిన చెక్క (ఆంగ్లం Cinnamon) భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము. ఇది సిన్నమామం (Cinnamomum) అనే చెట్టు బెరడునుండి లభిస్తుంది. దాల్చిన చెక్క...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here