నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని కోరిక – ఒక కొడుకు కథ

<h1>నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని కోరిక – ఒక కొడుకు కథ</h1>

రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది.

ఆమె పిల్లలు పడుకున్నారు!

భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో అభిమాన ‘క్యాండీ క్రష్ సాగా’ ఆటలో లీనమై ఆసక్తిగా ఆడుతున్నాడు.

చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది.

ఆ ఏడుపు..వెక్కిళ్ళ శబ్దానికి గేమ్ ఆడుతున్న ఆమె భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!

“ఓయ్ ! ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? చాలా రోజుల్నిండి నేను నిన్నేమి అనటం లేదుగా!!” అడిగాడతను టెన్షన్ తో

“నిన్న నా సెకండ్ క్లాస్ విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను!” “మీరు ఏం కావాలనుకుంటున్నారు” అనే అంశంపై ఏదైనా రాసుకుని రండీ!! ” అని చెప్పాను!!

Related:   A TRUE LIFE STORY !!!READ AND SHARE

తాను ఒక ప్రశ్నను అడిగితే.. మరో సమాధానం చెబుతున్న భార్యను విసుగ్గా చూస్తూ…

“సరేగానీ!! నీవ్వెందుకు ఏడుస్తున్నావు?” ప్రశ్నించాడతను.

“ఇదిగో! ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!”

భర్త ఆసక్తిగా….”అంత ఏడిపించే విధంగా ఏం రాశాడా బాబు?”

“వినండి చదువుతాను”

హెడ్డింగ్ ఇలా పెట్టాడు

“నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక.”

అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు!

వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా..శ్రద్ధగా ..ఇష్టంగా చూసుకుంటారు…చాలా సార్లు నా కన్నా ఎక్కువగా కూడా!!

నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది.. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది.. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!

అమ్మానాన్నలు.. ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే… ఒకటి రెండు రింగులు వచ్చే లోపే వాళ్ళు.. ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు!
కానీ.. నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!! …

Related:   Beautiful Love Story

ఒకవేళ నేను అప్పుడప్పుడు ఏడుస్తూ వుంటే కూడా!!….

చివరికి అప్పుడు కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!
వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!

వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు!
అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!!కానీ వాళ్ళకి అది ముఖ్యం కాదు!

అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ కి జవాబిస్తారు!

అమ్మానాన్నలు
స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!
ఎప్పుడూ తనలోనే ఉంచుకుంటారు!!
దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!
దాన్ని చాలా ఇష్టపడుతారు!!
దానితో రిలాక్స్ అవుతుంటారు!!
దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!
దానితో ముచ్చట్లు పెడుతారు!
దాన్ని చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతారు!
పడుకుంటునప్పుడు కూడా తనప్రక్కనే ఉంచుకుంటారు!!
ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు!!
దానితో చాలా ఆనందంగా ఆడుకుంటారు!!
దాన్ని ప్రేమిస్తారు!!

Related:   Pedarasi Peddamma Telugu Kathalu | Telugu Stories for Kids | Animated Stories In Telugu For Children

కాబట్టి! నా కోరిక ఏమిటంటే..నేను అమ్మానాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!!

భార్య చదువుతుంటే..విన్న భర్తకు కూడా మనసంతా పిండేసినట్లైంది!! ఉద్వేగభరితుడయ్యాడు..అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా…

“ఎవరు రాశారది? ” అడిగాడు భార్యని..గొంతు గద్గదమౌతుండగా…

“మన కొడుకు” అంది భార్య కన్నీరు కారుతుండగా!!!

✴✴✴✴✴

వస్తువులను ఉపయోగించుకోవాలి!
బంధాలను ప్రేమించాలి!!

అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరుచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే …..క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడుతుంటాయి!!

?????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *