పంటికి మందు… జాంపండు

• పంటికి మందు… జాంపండు..!
జామ పోషకాలకు చిరునామా అన్నది తెలిసిందే. నారింజతో పోలిస్తే జామలో నాలుగు రెట్ల సి-విటమిన్‌ ఎక్కువ. అందుకే జలుబూ దగ్గులతో బాధపడేవాళ్లకి జామకాయలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. ముఖ్యంగా ఫోలిక్‌ ఆమ్లం(విటమిన్‌-బి9) కూడా ఇందులో పుష్కలంగా దొరుకుతుంది. అందుకే గర్భిణీలు వీటిని ఎక్కువగా తినడంవల్ల పుట్టబోయే పిల్లల నాడీవ్యవస్థ చక్కగా అభివృద్ధి చెందుతుందట. ఇంకా ఇందులోని బి3, బి6 విటమిన్లు మెదడులో రక్తప్రసరణకు తోడ్పడటంతో మెదడు ఆరోగ్యంగా ఉండటంతోబాటు గ్రాహకశక్తి కూడా పెరుగుతుందట.
* జామ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. అందువల్ల వీటిని ఎంత ఎక్కువగా తిన్నా రక్తంలో చక్కెర నిల్వలు పెరగవు. మీడియం సైజు జామకాయలో రోజువారీ అవసరమైన పీచులో 12 శాతం అందుతుంది. అదేసమయంలో ఇందులో అధికంగా ఉండే పీచు గుండె ఆరోగ్యానికీ తోడ్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరిగేందుకు సహకరిస్తుంది.
* ఇందులోని పొటాషియం బీపీని నియంత్రణలో ఉంచుతుంది.
* జామలోని లైకోపీన్‌, క్యుయెర్సెటిన్‌, విటమిన్‌-సి… వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్లను నిరోధించడంతోబాటు రకరకాల ఇన్ఫెక్షన్లనూ నివారిస్తాయి.
* జామకాయల్లోని విటమిన్‌-ఎ కంటి ఆరోగ్యానికీ తోడ్పడతుంది. వీటిల్లోని కె-విటమిన్‌ చర్మసౌందర్యానికి ఉపకరిస్తుంది.
* జామకాయల్లోని మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తుంది.
* జామపండులోనే కాదు, ఆకుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు సూక్ష్మక్రిముల్ని నాశనం చేస్తాయి.
అందుకే పంటినొప్పులకీ చిగుళ్లవ్యాధులకీ జామ ఆకులు మంచి మందులా పనిచేస్తాయి.

Related:   Absolute Yoga

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *