పచ్చి మిరపకాయల కారం

Spread the love

పచ్చి మిరపకాయల కారం .

కావలసినవి .

పచ్చి మిరపకాయలు — 100 గ్రాములు .
చింతపండు — నిమ్మకాయంత
పదినిముషాలు తడిపి ఉంచుకోవాలి .
కొత్తిమీర — ఒక కట్ట బాగు చేసుకోవాలి .
ఉప్పు — తగినంత

పోపుకు .

నూనె — అయిదు స్పూన్లు .
ఎండుమిరపకాయలు — 4 ముక్కలు గా చేసుకోవాలి
మెంతులు — పావు స్పూను
మినపప్పు — స్పూను
ఆవాలు — అర స్పూను
ఇంగువ — కొద్దిగా
బెల్లం — చిన్న ముక్క. కారం తగ్గుతుంది .
ఇష్టపడని వారు మానేయవచ్చును.
కరివేపాకు — రెండు రెమ్మలు .
పసుపు — కొద్దిగా

Also READ:   అదిరి పోయే రుచితో ఇడ్లీ , దోశెలు మరియు చపాతీల లోకి కారప్పొడి

తయారీ విధానము .

ముందుగా పచ్చిమిరపకాయలు తొడిమలు తీసుకోవాలి .

స్టౌ మీద బాండి పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే పావు స్పూను మెంతులు వేసి వేయించుకుని విడిగా పెట్టుకోవాలి .

ఆ తర్వాత అదే బాండీలో పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి .

తర్వాత మళ్ళీ బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి వరుసగా ఎండుమిరపకాయలు , మినపప్పు , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి .

Also READ:   How to make Jeelebhi

ఇప్పుడు మిక్సీ లో ఒకసారి వేయించిన ఎండుమిరపకాయలు మెంతులు సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .

ఆ తర్వాత మగ్గపెట్టిన పచ్చిమిర్చి , చింతపండు , కొద్దిగా పసుపు, చిన్న బెల్లం ముక్క వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .

ఆ తర్వాత శుభ్రం చేసిన కొత్తిమీర వేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి .

తర్వాత ఒక గిన్నెలో కి తీసుకోవాలి .

తర్వాత ఫోటోలో చూపిన విధంగా పైన పోపు వేసుకుని పచ్చడిలో స్పూను తో కలుపుకోవాలి .

Also READ:   రేగి వడియాలు

అంతే ఎంతో రుచిగా ఉండే పచ్చిమిరపకాయల కారం రెడీ .

ఈ పచ్చడి వారం రోజులు నిల్వ ఉంటుంది.

ఇడ్లీ, దోశెలు , గారెలు , చపాతీలు మరియు భోజనము లోకి చాలా రుచిగా ఉంటుంది .

Updated: March 17, 2018 — 7:45 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *