పరగడుపున ఈ జావ త్రాగితే

పరగడుపున ఈ జావ త్రాగితే

**************************
షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్ల వంటి సమస్యలు రావు..

.బార్లి జావ తయారు చేసుకోవడం కుడా చాలా సులభమైన పద్దతిలో ఉంటుంది .ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను పోసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి .పావుగంట పాటు ఆ నీటిని బాగా మరిగించాలి .దీనితో బార్లీ గింజలు మెత్తగా మారుతాయి .వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి వెళ్తాయి .అనంతరం ఆ నీటిని చల్లార్చి దాంట్లో కొద్దిగా నిమ్మరసం లేదా ఒక టీ స్పూన్ తేనెను కలుపుకొని నిత్యం ఉదయాన్నే తాగాలి .దీంతో అనేక అనారోగ్యాలను నయం చేసుకోవొచ్చు .

Related:   పేనుకొరుకుడు సమస్య నివారణ

దీని వలన కలిగే అద్బుతమైన లాభాలు :

1.పైన చెప్పిన జావను రోజు ఉదయాన్నే పరగడుపున  త్రాగితే మనశరీరంలోని వ్యర్దాలన్ని మూత్రం రూపంలో బయటకు పోతాయి .పెద్ద ప్రేగు శుబ్రం అవుతుంది ,దిని వల్ల కోలన్ కాన్సర్ రాకుండా ఉంటుంది .

2.బాగా వేడిచేసినపుడు బార్లీ నీటిని త్రాగడం వల్ల  ఉపశమనం లభిస్తుంది .

3.కడుపులో అసిడిటీ ,మంట ,గ్యాస్ ,మలబద్దకం వంటి సమస్యలు తొలిగిపోతాయి .

4.బార్లీ నీటిలో సహజ సిద్దమైన యాంటి ఇనప్లమేటిరీ గుణాలు ఉంటాయి .ఇవి అన్ని రకాల వాపులను పోగొడతాయి .కీళ్ళ మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తాయి .

5. మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని తీసుకోవడం చాలా మంచిది .ఎందుకంటే బార్లీ లో ఉండే బీటా గ్లుకాగాన్ గ్లూకోస్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది .దాని వల్ల చక్కెర స్థాయిలు పెరగవు .

Related:   వ్యాధుల బారిన పడకుండా రక్షించే సహజ సిద్ధ ఔషధాలు

6.బార్లీ లో పీచు పదార్ధం పుష్కలంగా ఉంటుంది .అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది .

7.ఈ జావ వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్  తగ్గుతుంది .దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి .బిపి అదుపులో ఉంటుంది .

8.కిడ్నీలో రాళ్ళను కరిగించే శక్తి బార్లీ జావ కు ఉంటుంది .ప్రతిరోజు బార్లీ నీటిని త్రాగుతుంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి .

9.బాలింతలు బార్లీ నీటిని త్రాగితే పాలు బాగా పడుతాయి .జీర్ణశక్తి పెరుగుతుంది .

10.బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ జావా చాలా ఉపయోగపడుతుంది .ఇందులో ఉండే పోషకాలు శరీరం మేటాలిజం ను క్రమబద్దికరిస్తుంది .దీంతో బరువు తగ్గుతారు .అయితే బరువు తగ్గాలి అనుకునేవారు ఉదయంతో పాటు సాయంత్రం కుడా త్రాగితే ఇంకా బాగుంటుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *