పవన్ కు షాక్ జనసేనకు మరో కీలక నేత రాజీనామా వైసీపీలో చేరిక – All Time Report

Advertisementజనసేన పార్టీకి తాజాగా వరుస షాక్ లు తగుతున్నాయి.. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నాయకులు నెలకి ఒకరు చొప్పున పార్టీకి గుడ్ బై చెబుతున్నారు… ఇటీవలే విశాఖ నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పారు.

అయితే పవన్ సినిమాల్లో నటించడం పై ఆయన అభ్యంతరం తెలిపారు.. ఇలా సీనియర్లు పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ పరిస్దితి ఏమిటా అని నేతలు ఆలోచన చేస్తున్నారు, తాజాగా జనసేనకు మరో నాయకుడు కూడా గుడ్ బై చెప్పారు.

READ:   సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ప్రిన్స్ మహేష్ బాబు చిత్రం - All Time Report

అయితే అది ఎక్కడో కాదు గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం నుంచి.. అవును అక్కడ పార్టీ తరపున సీనియర్ నాయకుడిగా కొనసాగిన జనసేన నాయకుడు కరణం కనకారావు పార్టీని వీడారు.

అంతేకాదు పార్టీకి గుడ్ బై చెప్పి వెంటనే గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట.

READ:   చైనాలోని వుహాన్ లో మ‌రో దారుణం - All Time Report