‘పహిల్వాన్’ ప్యాన్ ఇండియా స్థాయికి వెళ్లడానికి రాజమౌళి కారణం!


bredcrumb

Kannada Movies

oi-Santhosh Kumar Bojja

|

కన్నడ స్టార్ సుదీప్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పహిల్వాన్’. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో విడుదల చేస్తున్నారు. వారాహి చలన చిత్రం బేనర్ వారు తెలుగులో దీన్ని విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ.. ‘పహిల్వాన్’ మూవీ ప్యాన్ ఇండియా చిత్రంగా విడుదలవ్వడానికి కారణం ఈగ, బాహుబలి చిత్రాల దర్శకడు రాజమౌళి అని తెలిపారు. ఈ రెండు చిత్రాల్లో తాను నటించడం వల్లే నార్త్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైనట్లు వెల్లడించారు. సౌతిండియా సినిమాలకు నార్త్ ఇండియాలో క్రేజ్ పెరగడానికి కూడా రాజమౌళి ప్రధాన కారణమని సుదీప్ తెలిపారు.

‘బలం కన్నా ధైర్యంతో కొట్టేవాడు రౌడీ. బలమైన కారణం కోసం కొట్టేవాడు ‘యోధుడు’ అనే డైలాగుతో ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇందులో సుదీప్… కృష్ణ అనే పహిల్వాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కృష్ణ గురువు పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించాడు.

‘పహిల్వాన్’ మూవీ ఐదు భాషల్లో విడుదలవుతుండటంతో తెలుగులో చిరంజీవి, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో సునీల్ శెట్టి, తమిళంలో విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఇప్పటికే ఫస్ట్ పోస్టర్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఎస్. కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

READ:   నందమూరి ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త: ఎన్టీఆర్ తండ్రిగా బాలకృష్ణ.. బడా డైరెక్టర్ ప్లాన్.!

‘పహిల్వాన్’లో సుదీప్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా…, సునీల్ శెట్టి, సుశాంత్ సింగ్, కబీర్ దుహన్ సింగ్, శరత్ లోహితశ్వ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 12న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుదీన్ కెరీర్లో విడుదలవుతున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ ఇది.

READ:   యశ్.. తన భార్యను ఎలా ఆడిస్తున్నాడో చూడండి.. స్పెషల్ వీడియో షేర్ చేసిన రాధిక