పాల కూర మరియు మెంతి కూర తో ఫ్రైడ్ రైస్

పాల కూర మరియు మెంతి కూర తో ఫ్రైడ్ రైస్
***********************
కావలసినపదార్థములు-
పాలకూర -రెండు కట్టలు
మెంతికూర -రెండు కట్టలు
ఉల్లిపాయ-1
పచ్చి మిరపకాయలు-2
కొత్తిమీర
నెయ్యి- తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్-కొంచెం
బాస్మతిబియ్యం -2కప్పులు
సోయా సాస్ 1 స్పూన్ (వేయనున్న సరే)
ఉప్పు
***********************
తయారీవిధానం- ముందు అన్నం వండుకోవాలి ,1 కప్పు కి ఒకటిన్నర నీళ్లు పోసి వండాలి ..కొంచెంచల్లారనివ్వాలి ..ఇప్పుడు వెడల్పు బాండీ లో నెయ్యి వేసి ,పచ్చి మిరప, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక తరిగిన పాల కూర, మెంతి కూర వేసి పచ్చి వాసన పోయి మెంతి కూర మంచి వాసన వచ్చే వరకు వేయించి అందులో ఉప్పు సొయా సాస్ వేసి కలిపి ..అన్నం వేసి బాగా కలిపి 5 నిముషాలు మూత పెట్టి మగ్గిస్తే చాలు కమ్మని ఫ్రైడ్ రైస్ తయ్యార్..నెయ్యి బదులుగా బట్టర్ కూడా వాడొచ్చు ..ఖాజాతో గార్నిష్ చేసి రైతా తో తినడమే ఇక
***********************

Related:   దోసావకాయ తయారీ విధానము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *