‘పింక్‌’ నుంచి ఓ శుభవార్త – Pakka Filmy – Telugu


పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ కోసం సినీప్రియులంతా ఎంత ఆతృతతో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శరవేగంగా సెట్స్‌పై ముస్తాబవుతోన్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 15న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక చిత్ర విడుదలకు మరో రెండు నెలల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సిద్ధం చేసే పనిలో బిజీ అయిపోయారు.

READ:   ప్రముఖ నటుడి తమ్ముడు ఆత్మహత్య.. కేసులో కొత్త మలుపు! పోలీసుల చేతిలో..

ఇందులో భాగంగానే తాజాగా ఆయన ఓ శుభవార్త వినిపించారు. ఈ చిత్రం కోసం ఓ స్టార్‌ సింగర్‌ను రంగంలోకి దించుతున్నట్లు ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ఇంతకీ ఆయన మరెవరో కాదు.. తాజా యువ సంగీత సంచలనం సిద్‌ శ్రీరామ్. గతేడాది ‘సామజవరగమన’ అంటూ సినీ సంగీత ప్రియుల్ని తన గాత్రంతో ఉర్రూతలూగించిన ఈ యువ కెరటం..

ఇప్పుడు ‘పింక్‌’ రీమేక్‌లో ఓ గీతాన్ని ఆలపించబోతున్నట్లు తమన్‌ ట్విటర్‌లో తెలియజేశారు. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ‘వకీల్‌ సాబ్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోంది చిత్ర బృందం. ఉగాది కానుకగా చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

READ:   ఆ కోర్సుల్లో మీ ఇష్టం కుదరదు, తేల్చిచెప్పిన యూజీసీ, ఏఐసీటీఈ.. జగన్ నిర్ణయానికి బ్రేక్ ! - Pakka Filmy - Telugu