పుట్టిన శిశువుకు తీసుకోవలసిన జాగ్రత్తలు

పుట్టిన శిశువుకు తీసుకోవలసిన జాగ్రత్తలు –

* ప్రసవకాలంలో శిశువుకి కలుగు వ్యాధులు –

1 – పుట్టుకతో ఊపిరి తీయకుండా ఉండటం.

2 – తలపైన రక్తం గడ్డకట్టడం .

3 – తలమీద వాపు .

4 – తల ఎముకలు విరుగుట .

5 – తలలో రక్తస్రావం అగుట.

6 – కాళ్లు , చేతులు ఎముకలు విరుగుట.

7 – పక్షవాతం.

8 – చేతిపక్షవాతం .

మొదలగు వ్యాధులు తరుచుగా కలుగును.

* శిశువుకి స్తన్యం ఇచ్చునప్పుడు పాటించవలసిన పద్ధతులు –

1 – బిడ్డకు మొదటి నాలుగు రోజుల్లో నాలుగేసి సార్లు పాలు ఇవ్వవలెను . తల్లి విశ్రాంతి నుంచి లేచిన వెంటనే పాలు ఇవ్వవలెను .

2 – స్తన్యమును కొద్ది నిమిషములు మాత్రమే ఇవ్వవలెను . నాలుగు గంటలకి ఒకసారి కాచి చల్లార్చిన నీటిని ఒక స్పూన్ చొప్పున ఇవ్వవలెను .

3 – తల్లికి పాలు పడిన తరువాత 4 గంటలకి ఒకసారి 10 నిమిషాలకి కాలం స్తన్యం ఇచ్చుచుండవలెను . బిడ్డని ఒడిలో ఉంచుకుని చేయి తలక్రింద ఊతగా ఉంచి స్థనం శిశువు నోటిలోకి వచ్చునట్లు కొంచం ముందుకు వంగి పాలు ఇవ్వవలెను . రాత్రి 10 గంటలు మొదలు ఉదయం 6 గంటల వరకు పాలు ఇవ్వకూడదు .

Related:   ఈ?ఆరోగ్యసూత్రాలు తెలుసా?

* తల్లిపాలలో దోషములు ఉన్నవో లేవో పరీక్షించుట –

స్తన్యం చల్లగా , నిర్మలముగాను , పలుచగాను ఉండవలెను . శంఖం వలే తెల్లగాను నీటియందు వేసిన వెంటనే నీటితో కలిసిపోయి నురుగు లేకుండా , తీగబారకుండా , మునగకుండా , నీటి మీద తేలకుండా ఉండవలెను . అనగా నీటిలో పడగానే నీటిలో కలిసిపోయేంత స్వచ్ఛంగా ఉండవలెను .

స్వచ్చమైన తల్లిపాలు ప్రాకృతమైన వర్ణం , సువాసన , స్వచ్చత కలిగి ఉండాలి . అట్టి శుద్దమైన స్తన్యం శిశువుకు బలం కలిగించును.

పైన చెప్పిన లక్షణాలకి వ్యతిరేకంగా లక్షణాలు కలిగి ఉన్నట్టయితే ఆ తల్లిపాలు ఆ శిశువుకి అనారోగ్యం కలిగించును.

దుష్టమగు స్తన్యం నీటి యందు వేసినచో తేలుతుంది . కారం , పుల్లగా, ఉప్పగా ఉంటుంది. పాలు పరీక్షించినచో పాలపైన పచ్చని రేఖల్లా కనిపించినచో మరియు తీగల వలే సాగుచున్నచో అది దుష్టస్తన్యం అని గమనించవలెను .

Related:   301 Moved Permanently

ఈ లక్షణాలు కలిగిన స్తన్యం శిశువుకి ఎట్టి పరిస్థితుల్లో శిశువుకి ఇవ్వరాదు . లేనిచో శిశువు కి రోగాలు సంభవిస్తాయి.

* తల్లి యొక్క స్తన్యం సరియైనది కానపుడు చేయవలసిన విధి –

తల్లి యొక్క స్తన్యం సరిగ్గా లేనప్పుడు తల్లి పాలకు బదులు దేశి ఆవుపాలు , మేకపాలు వాడుటకు మిక్కిలి శ్రేష్టమైనది . ఆవు పాలు మరియు మేకపాలు సులభముగ జీర్ణం అగుటకు ఆవుపాలను ఈ క్రింది విధముగా సంస్కరించి ఉపయోగించవలెను .

ఆవుపాలు – 3 ఔన్సులు .

కాచిన నీరు – 3 ఔన్సులు .

పాలచక్కెర – 2 చిన్న చెంచాలు .

* నెల తక్కువ బిడ్డలను పెంచే విధానం –

కొంతమంది శిశువులు పూర్తిగా నెలలు నిండకుండానే జన్మిస్తారు . వారి విషయంలో కడు జాగ్రత్తతో ఉండవలెను . బిడ్డ 4 పౌన్లు అనగా ఒక కిలో 800 గ్రాములు వచ్చువరకు స్నానం చేయించరాదు. పాలు ఇచ్చుటకు పడక పై నుండి లేవదీయరాదు. తల్లిపాలలో సమముగా కాచిన నీరు కలిపి 3 గంటలకు ఒకసారి కలిపి ఇవ్వవలెను . మి నవీన్

Related:   Vitex negundo - వావిలి

శిశువు తూకంలో 6 వ వంతు బరువుగల ఆహారమును ఇవ్వవలెను . శిశువు బరువు 5 పౌనులు అనగా 2 కిలోల 600 గ్రాములు కంటే కొంచం ఎక్కువ బరువు దాటేంత వరకు అత్యంత జాగ్రత్తతో శిశువుని కాపాడవలెను . అతరువాత మాములు శిశువు కి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *