Home Bhakti పురాణ విజ్ఞాన వేదిక తరవాయి భాగం

పురాణ విజ్ఞాన వేదిక తరవాయి భాగం

- Advertisement -

పురాణ విజ్ఞాన వేదిక తరవాయి భాగం
???????

కిరీటి’ ఎవరికి మరో పేరు?

అర్జునుడు.

‘ఎందరో మహానుభావులు’ అను త్యాగరాజకృతి ఏ అయిదు కృతులలో ఒకటి?

పంచరత్నకీర్తనలు.

తరాజు చిహ్నంతో కనిపించు రాశి ఏది?

తులారాశి.

బాణం ఆకారంలో ఉండే 3 నక్షత్రాలని మనం ఏమని పిలుస్తాము?

శ్రవణం.

‘సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్‌’ ఏ వేదంలో కనపడుతుంది?

ఋగ్వేదం.

వేదాలను పలురకాల గోవులతోనూ, బ్రహ్మజ్ఞానాన్ని పాలతోనూ ఏ ఉపనిషత్తు పోలుస్తుంది?

‌అమృతబిందు ఉపనిషత్‌.

అమృతబిందు ఉపనిషత్‌ ఏ వేదానికి చెందినది?

కృష్ణయజుర్వేదం.

‘శతరుద్రీయం’ రోజుకు ఒక్కసారైనా పారాయణ చేస్తే తెలిసి చేసిన, తెలియక చేసిన – పాపాలను హరిస్తుందని ఏ ఉపనిషత్‌ చెబుతుంది?

కైవల్యోపనిషత్‌.

రావణుడు ఇంకొక స్త్రీని బలాత్కరించిన అతని తల నూరు చెక్కలవుతుందని శపించింది ఎవరు?

బ్రహ్మ.

పుష్పక విమానంలో ఏ దేవి మూర్తిని ఏనుగులు పూజిస్తున్నట్లు బొమ్మలు ఉన్నాయని సుందరకాండ చెబుతుంది?

లక్ష్మీదేవి.

కాశీలోని పంచగంగ ఘాట్‌లో ఏ అయిదు నదులు కలుస్తాయని ప్రతీతి?

గంగ, యమున, సరస్వతి, కిరణ, ధూరపాప.

అర్జునుని తప్ప పాండవులని ఒక్కరోజు యుద్ధంలో ముందుకు వెళ్ళకుండా ఆపగలిగే వరం శివుడు ఎవరికిచ్చాడు?

జయద్రధుడు (సైంధవుడు).

దృష్టద్యుమ్నుని వధించకుండా కవచాన్ని తీయనని ఎవరు ప్రతిజ్ఞ చేశారు?

అశ్వత్ధామ.

శతదృ నదిని ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నారు?

సట్లెజ్‌.

కచుడు ఎవరి పుత్రుడు?

బృహస్పతి.

శుక్రాచార్యుడు ఏ దానవరాజు దగ్గర ఉండేవాడు?

‌వృషపర్వుడు.

కచుడు శుక్రాచార్యుని దగ్గర ఎన్ని సంవత్సరాల బ్రహ్మచర్య వ్రతం ఆచరించేందుకు పూనుకొన్నాడు?

1000

దేవయాని ఎవరి కుమార్తె?

శుక్రాచార్యుడు.

అసురులు కచుని ఎన్నిసార్లు వధించారు?

3.

అతను చనిపోయిన ప్రతిసారీ ఎలా బ్రతికి వచ్చాడు?

శుక్రాచార్యుని మృత సంజీవిని వలన.

జరాసంధుడు మధురపై యవనునికి ముందు ఎన్నిసార్లు దండయాత్ర చేశాడు?

17.

యవనుడు ఎవరివల్ల భస్మమయ్యాడు?

ముచికుందుడు.

ముచికుందుడు ఎవరి కుమారుడు?

మాంధాత.

రుక్మిణి తండ్రి ఎవరు?

భీష్మకుడు.

శ్రౌత సూత్రాలు, స్మార్త సూత్రాలను కలిపి ఏ సూత్రాలు అంటారు?

కల్పసూత్రాలు.

గృహ్యసూత్రాలు, ధర్మసూత్రాలను కలిపి ఏమంటారు?

‌స్మార్త సూత్రాలు.

ద్రాహ్యాయన గృహ్యసూత్రం ఏ వేదానికి చెందింది?

సామవేదం.

మానవ శుల్భసూత్రం ఏ వేదానికి చెందింది?

కృష్ణయజుర్వేదం.

భార్గవరార్‌ అనేది ఏ అళ్వారు మరో పేరు?

తిరుమలి సాయి అళ్వారు.

నమ్మాళ్వారు చిహ్నం ఏమిటి?

విష్వక్సేనుడు.

పట్టనాధన్‌ అని ఏ అళ్వారును పిలుస్తారు?

పెరియాళ్వారు.

శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రసిద్ధి చెందిన నయనారు ఎవరు?

కన్నప్ప నయనార్‌.

ఈయన మరో పేరు ఏమిటి?

ధీరన్‌.

పెరియ పురాణం మొదలు, చివర ఏ నయనారు గురించి చెబుతుంది?

సుందరమూర్తి నయనార్‌.

దర్శపూర్ణ మాస యాగాలు ఏ తిధులలో చేస్తారు?

అమావాస్య, పౌర్ణమి.

దక్షయజ్ఞ ధ్వంసం గురించి ఏ బ్రాహ్మణం పేర్కొంటుంది?

‌గోవధ బ్రాహ్మణం.

వనవాసమునకు పోవు ముందు సీతారాములు అయోధ్యలో ఎన్ని సంవత్సరములు కలిసి ఉన్నారు?

పన్నెండు.

సంపాతి, జటాయువు ఎవరి సంతానం?

అనూరుడు.

ఆంధ్రదేశం గురించి భీష్మునికి, కర్ణుడికి జరిగిన సంవాదం ద్వారా భారతంలోని ఏ పర్వంలో కనిపిస్తుంది?

ద్రోణపర్వం.

భగదత్తుడు ప్రయోగించిన వైష్ణవాస్త్రం శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి ఎలా మారినది?

వైజయంతిమాల.

రాక్షసరాజు అలంబషుని మహాభారత యుద్ధంలో ఎవరు సంహరించారు?

ఘటోత్కచుడు.

సేద్యం గురించి వేదాలలో ఎక్కడ వివరించారు?

తైత్తరీయ సంహిత.

విజ్ఞానాన్ని సంపాదించిన వారెవరైనా బ్రాహ్మణతుల్యునిగా గౌరవించుట గురించి చెప్పిన కవశోపాఖ్యానం ఏ బ్రాహ్మణంలో కనిపిస్తుంది?

ఐతరేయ బ్రాహ్మణం.

‘ధీర సమీరే, యమునా తీరే…’ అని సాగే అష్టపది ఎవరు రచించారు?

జయదేవుడు.

‘శ్రీకర భాష్యం’ రచించిన వారెవరు?

శ్రీపతి.

యజ్ఞయాగాలు చేసిన వారు ఏ మార్గంలో చంద్రమండలం చేరగలరని ఉపనిషత్తులు చెబుతున్నాయి?

దక్షిణమార్గం.

ఒక బలమైన గుఱ్ఱం ఒక పగలంతా పరుగెత్తితే ఎన్ని యోజనాలు వెళుతుందో ఆ దూరానికి వైదిక విధిలో ఏమని పేరు?

అశ్వీనం.

ఐతరేయ బ్రాహ్మణం ద్రవ్య యజ్ఞంతో ప్రారంభమయి ఏ యజ్ఞంతో పరిసమాప్తమవుతుంది?

జ్ఞానయజ్ఞం.

సకల కర్మలు జ్ఞానంతో పరిసమాప్తి పొందుతాయి అని ఎక్కడ చెప్పబడినది?

భగవద్గీత.

స్వామివారికి ప్రీతిపాత్రమైన వాహనం ఏమిటి?

గరుడ వాహనం.

సమాప్తం.
జైశ్రీమన్నారాయణ.
???????

Originally posted 2018-05-15 17:42:37.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

Can Diabetics Eat Eggs: మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్లు తినవచ్చా?

డయాబెటిస్‌కు గుడ్లు మంచివి గుడ్లు సులభమైన, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన అల్పాహారంగా భావిస్తారు. గుడ్లు ప్రోటీన్ కు అద్భుతమైన మూలం మరియు వాటిని...
- Advertisement -

మొక్కజొన్న కర్రీ 

• మొక్కజొన్న కర్రీ కావల్సినవి: లేత మొక్కజొన్న - ఒకటి (ముక్కల్లా కోయాలి), ఉడికించిన స్వీట్‌కార్న్‌ - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, కరివేపాకు -...

అందంగా జుట్టు పెరగడానికి : ఉసిరికాయ పౌడర్ | How to Use Amla Powder For Hair Growth

ఉసిరికాయ పొడితో జుట్టు సంరక్షణ తలపై పేలవమైన ఆరోగ్యం చాలా జుట్టు సమస్యలకు దారితీస్తుంది. కానీ మీ జుట్టుకు ఉసిరికాయను...

Related News

Can Diabetics Eat Eggs: మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్లు తినవచ్చా?

డయాబెటిస్‌కు గుడ్లు మంచివి గుడ్లు సులభమైన, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన అల్పాహారంగా భావిస్తారు. గుడ్లు ప్రోటీన్ కు అద్భుతమైన మూలం మరియు వాటిని...

మొక్కజొన్న కర్రీ 

• మొక్కజొన్న కర్రీ కావల్సినవి: లేత మొక్కజొన్న - ఒకటి (ముక్కల్లా కోయాలి), ఉడికించిన స్వీట్‌కార్న్‌ - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, కరివేపాకు -...

అందంగా జుట్టు పెరగడానికి : ఉసిరికాయ పౌడర్ | How to Use Amla Powder For Hair Growth

ఉసిరికాయ పొడితో జుట్టు సంరక్షణ తలపై పేలవమైన ఆరోగ్యం చాలా జుట్టు సమస్యలకు దారితీస్తుంది. కానీ మీ జుట్టుకు ఉసిరికాయను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here