పూరీలు / చపాతీలు / మరియు రోటీల లోకి వెజిటబుల్ కూర్మా

పూరీలు / చపాతీలు / మరియు రోటీల లోకి వెజిటబుల్ కూర్మా .

కావలసినవి.

బంగాళా దుంపలు — రెండు
క్యారెట్ — మూడు
టమోటోలు — రెండు
బీన్స్ — 150 గ్రాములు.

ఈ కూరలన్నీ ముక్కలుగా చేసుకోవాలి.

క్యారెట్ , బీన్స్ మరియు బంగాళాదుంపలు వేరే గిన్నెలలో సరిపడా నీళ్ళు పోసి కుక్కర్ లో పెట్టుకుని మూడు విజిల్స్ రానిచ్చి దింపుకోవాలి.

బంగాళాదుంపలు ముక్కలు చేసి ఉడికిన తర్వాత పై తొక్కు తీసుకోవాలి .

ఇవ్వన్నీ విడిగా వేరే ప్లేటులో ఉంచుకోవాలి .

READ:   తాపేశ్వరం మడత కాజా

కూర్మా కూర గ్రేవీ కు.

ఎండుమిరపకాయలు — 4
టమోటోలు — రెండు
ధనియాలు — స్పూను
దాల్చిన చెక్క — చిన్న ముక్క
పచ్చి కొబ్బరి తురుము — మూడు స్పూన్లు .
జీడిపప్పు — 6
పచ్చి బఠాణీలు — పావు కప్పు

కావలసిన మిగిలిన వస్తువులు.

కరివేపాకు — మూడు రెమ్మలు
కొత్తిమీర — చిన్న కట్ట
పసుపు — కొద్దిగా
ఉప్పు — తగినంత
నూనె — నాలుగు స్పూన్లు

తయారీ విధానము .

ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయలు , ధనియాలు , దాల్చిన చెక్క , జీడిపప్పు వేసి వేయించుకుని అందులో టమోటో ముక్కలు మరియు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కాసేపు ఉంచి చల్లారగానే మిక్సీలో కొద్దిగా నీళ్ళు పోసి ముద్దగా వేసుకోవాలి .

READ:   పచ్చ పెసలు రోటి పచ్చడి

తర్వాత మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే జీలకర్ర పచ్చి బఠాణీలు , టమోటో ముక్కలు కరివేపాకు వేసి అందులో ఉడికించిన ముక్కలు , కొద్దిగా పసుపు మరియు తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ముక్కలను మగ్గనివ్వాలి .

తర్వాత అందులో సిద్ధం చేసుకున్న ముద్దను వేసి కొద్దిగా నీళ్ళు పోసి గ్రేవి మొత్తము ముక్కలకు పట్టే విధముగా మగ్గ నివ్వాలి .

తర్వాత కొత్తిమీర కూడా
వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

READ:   మరో కొత్త వెరైటీ మజ్జిగ పులుసు

అంతే పూరీ , చపాతీ లు మరియు రోటీల లోకి ఎంతో రుచిగా ఉండే కూర్మా కూర సర్వింగ్ కు సిద్ధం.

Originally posted 2019-02-11 00:18:23.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *