పెట్రోల్‌తో బ్లాక్‌మెయిల్ చెయ్యాలనుకుంది… అగ్గిపుల్లతో తగలబెట్టి పారిపోయిన లవర్– News18 Telugu

Advertisement


పెట్రోల్‌తో బ్లాక్‌మెయిల్ చెయ్యాలనుకుంది… అగ్గిపుల్లతో తగలబెట్టి పారిపోయిన లవర్

Maharashtra | Nashik : మహారాష్ట్ర… నాసిక్‌లోని లాసల్‌గావ్ బస్టాండ్. రోజూ లాగే పెద్దగా రద్దీ లేకుండా మామూలుగా ఉంది. ఇంతలో 35 ఏళ్ల మహిళను… 25 ఏళ్ల కుర్రాడు… సజీవంగా తగలబెట్టాడు. అంతే… మంటల్లో తగలబడుతున్న ఆమెను చూసి… అంతా షాకయ్యారు. బస్టాండ్‌లో కూర్చున్నవారూ, వాహనాల్లో ఉన్నవారు, రోడ్డుపై వెళ్తున్నవారూ… అందరూ ఆమెనే చూశారు. ఆమెను తగలబెట్టిన యువకుడు పారిపోయాడు. స్థానికులు ఆమె మంటల్ని ఆర్పి… ఆస్పత్రికి తరలించారు. 50 శాతం గాయాలతో ఆమె ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతోంది. పోలీసులు ఎంటరై… ఏం జరిగిందని ఆమెనే అడిగారు. వాళ్లకు తన వాంగ్మూలం ఇచ్చింది. ఆమె చెప్పిన దాని ప్రకారం… తగలబెట్టిన వ్యక్తి పేరు రామేశ్వర్ భగవత్. తన భర్త చనిపోవడంతో ఆమె… రామేశ్వర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఐతే… నెల కిందట మరో మహిళను పెళ్లి చేసుకున్న రామేశ్వర్… అప్పటి నుంచీ బాధితురాలిని పట్టించుకోవడం మానేశాడు.

తనకు అన్యాయం జరుగుతోందని భావించిన బాధితురాలు… ఈ విషయమై మాట్లాడేందుకు ఓసారి బస్టాండ్ దగ్గరకు రమ్మంది. అతను ఒక్కడే రాకుండా… తన బంధువును, మరో యువకుణ్ని వెంటబెట్టుకొని వచ్చాడు. అక్కడకు టూ వీలర్‌లో వచ్చిన బాధితురాలు… బండి దిగి… పెట్రోల్ ఉన్న ఓ బాటిల్‌ను బండి లోంచీ బయటకు తీసింది. “నేను ఒంటరి అయిపోయాను. నిన్ను నమ్మితే నన్ను మోసం చేస్తావా. ఇది నీకు తగదు. నన్ను పెళ్లి చేసుకో. లేదంటే ఈ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటాను అంది.” షాకైన అతను… “ఇప్పుడు నాకు పెళ్లైంది. ఇక నీతో ఉండటం కుదరదు. నన్ను మర్చిపో అన్నాడు” “అలా ఎలా కుదురుతుంది. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. ఆమెను వదిలెయ్యాలి” అంటూ పెట్రోల్ బాటిల్ మూత విప్పింది. ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆమె చచ్చిపోతానంటూ… పెట్రోల్ మీద పోసుకుంది. అయితే చావు అంటూ… తన జేబులోంచీ అగ్గిపెట్టె తీసి… పుల్ల వెలిగించి ఆమెపై విసిరాడు. అతనితో వచ్చిన ఇద్దరూ షాకయ్యారు. ముగ్గురూ తలోదిక్కుకూ పారిపోయారు.

READ:   ఇలానే చేస్తే నా దారి నేను చూసుకుంటా – ఆగ్రహంతో లేచివెళ్లిపోయిన వైసిపి ఎమ్మెల్యే..!! - Pakka Filmy - Telugu

ఇదంతా తెలుసుకున్న పోలీసులు… ఆమె స్టేట్‌మెంట్ నమోదు చేసి… ముగ్గురిలో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక నిప్పంటించిన రామేశ్వర్ మాత్రం ఇంకా దొరకలేదు. బాధితురాలిని పరామర్శించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే… రామేశ్వర్‌ని వెతికి పట్టుకోమని ఆదేశించారు.చచ్చిపోతానని బెదిరిస్తే… తన మాట వింటాడనీ, తనతోనే ఉంటాడనీ బాధితురాలు భావించింది. కానీ… రామేశ్వర్ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తాడనీ, తననే తగలబెడతాడని ఆమె ఊహించలేదు. ఫలితంగా ఆమెకు ఈ దుస్థితి తలెత్తింది.

ఇది చదవండి

READ:   Covid-19 : ఐసోలేషన్‌లో ఆ 10 మంది ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది..First published: February 16, 2020