పెళ్లి చీర – పిల్ల తేళ్ళు

పెళ్లి చీర – పిల్ల తేళ్ళు

ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక భక్తురాలు తన కూతురుతో కలిసి శ్రీమఠానికి వచ్చింది. వారి వద్దనున్న పళ్ళెంలో పసుపు, కుంకుమ, టెంకాయలు, తమలపాకులు, పూలతో పాటు మంగళసూత్రాలు కూడా ఉన్నాయి. బహుశా ఆ అమ్మాయికి వివాహం నిశ్చయమైంది అనుకుంటా. ఆ పళ్ళంలో ముహూర్తం చీర కూడా ఉంది.

పరమాచార్య స్వామివారు ఎప్పుడూ పట్టువస్త్రముల వాడకాన్ని ఇష్టపడేవారు కాదు. భక్తులను కూడా పట్టును విడువలసిందిగా చెప్పేవారు. పట్టు వస్త్రం తయారీలో ఎంతో జీవహింస ఉంటుంది మరియు అది కేవలం ఐశ్వర్య ప్రదర్శన మాత్రమె కనుక. కాని ఆ విషయం ఈ భక్తురాలికి తెలియక ఎర్రటి పట్టుచీరను స్వామివారి ఆశీస్సుల కోసం తెచ్చింది.

మహాస్వామివారి ఆశిస్సులకోసం ఆ పళ్ళాన్ని అందించింది. కాని బాలుమామ దాన్ని ఒప్పుకోలేదు. ఆశీస్సులకోసం ఎర్రని పట్టుచీర పెట్టడంతో కోపంతో, ఆ చీరను తీసివేసి మిగిలిన వస్తువులను మాత్రం అక్కడ ఉంచాడు. పరమాచార్య స్వామివారు లోపలున్న గదిలో ఉన్నారు. బయట ఆ భక్తురాలు బాలు మామతో గొడవకు దిగింది. స్వామివారి ఆశీస్సుల కోసమని ఉంచిన ముహూర్తం చీరను తిసివేయడంతో ఆమె కొంత వేదన పొందింది.

READ:   అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా

ఈ గొడవను విని భక్తులకు దర్శనం ఇవ్వడానికి శ్రీవారు బయటకు వచ్చారు. అక్కడ కూర్చుంటూ, “అవును, ఆ చీరను వేరేగా ఉంచండి” అని అన్నారు. కాని, పరమాచార్య స్వామివారు భక్తుల్ని కష్టపెట్టరు అన్న విషయం తెలిసిందే. అందుకే మహాస్వామివారి మాటలను విని బాలు మామ ఆశ్చర్యపోయారు. ఒక కర్రను తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు. ఆ కర్ర సహాయంతో స్వామివారు ఆ చీర మడతలను విప్పగా, అందులోనుండి ఒక పెద్ద తేలు, రెండు చిన్న తేళ్ళు బయటకు వచ్చాయి.

READ:   మనలోని శక్తులు

వాటిని చూడగానే ఆ భక్తురాలు భయపడింది. ఇప్పుడే అంగడి నుండి తెచ్చిన కొత్త చీరలో ఆ తేళ్ళు ఎలా వచ్చాయో అని లోచనలో పడింది. కేవలం పరమాచార్య స్వామివారి అపార కృప వల్ల ఆ తేళ్ళ బారినుండి బయటపడ్డాము అని ఊపిరి పీల్చుకుంది.

“అందుకే దాన్ని వేరుగా ఉంచమన్నాను” అని అన్నారు మహాస్వామి. వాటిని చంపవద్దని ఆదేశించారు. “వధువు చీర ఈ రంగులో ఉండరాదు. అది ముదురు ఎరుపు రంగులో ఉండాలి. అదే దుకాణంలో ఇచ్చి పసుపుది కాని, వేరే ఏదేని మంగళకరమైన రంగు చీరను తెచ్చుకొండి. ఈ విషయం గురించి దుకాణదారునికి చెప్పవలసిన అవసరం లేదు“ అని వారిని ఆశీర్వదించి పంపారు.

READ:   చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం

స్వామివారు దివ్యదృష్టితో ఆ తేళ్ళను గుర్తించి ఈ పని చేశారు అని అనుకుంటే అది మన మూర్ఖత్వమే. స్వామివారు ఎప్పుడూ చెప్పే మాటల్ని పాటించిన బాలు మామ వాక్కును నిజం చెయ్యడానికి అక్కడికక్కడే ఈ లిలను చేశారు.

స్వామిపై మనకి ఉన్ననిజమైన భక్తితో మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుందని మనకు కనువిప్పు కలిగించే సంఘటన ఇది.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

— శ్రీ మఠం బాలు మామ, ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Originally posted 2019-05-14 02:52:47.