పేద కళాకారులను ఆదుకుంటున్న రోజా..! – Adya News


mla roja donates 100 bags of rice to poor film workers

కరోనా ప్రభావంతో సినిమా పరిశ్రమకు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పాలి. షూటింగ్స్ లేకపోవడంతో చాలా మంది నటీనటులు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే సినిమా పరిశ్రమను నమ్ముకుని వేలాది మంది శ్రామికులు, కళాకారులు పనుల్లేక తిండికోసం చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

ఏ రోజుకు ఆ రోజు పని చేసి డబ్బులు తీసుకుని కుటుంబాన్ని పోషించుకునే సినీ కార్మికులు చాలా మంది పరిస్థితి దయనీయంగా ఉంది. అయితే ఇలాంటి వాళ్లను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు సినీ నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా. పేదకళాకారుల ఆకలి బాధను ఆర్దం చేసుకున్న రోజా.. 100 బస్తాల బియ్యాన్ని విరాళంగా ప్రకటించింది. ఇలాంటి పరిస్థితిలో సినిమా పరిశ్రమను నమ్ముకుని ఉన్నవారిని ఆదుకోవాలని కోరుతున్నారు పేద కళాకారులు.

READ:   కొత్త పొత్తు పొడిచేనా?: దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రే భేటీ

సినిమాల ద్వారా కోట్లు కోట్లు సంపాదించిన స్టార్ హీరోలు, బడా దర్శకులు, నిర్మాతలు కరోనాపై రూపాయి ఖర్చులేకుండా ట్విట్టర్‌లో ఓ ట్వీట్ పెట్టి వదిలేయకుండా పేదలకు సాయం చేసి వాళ్ల ఆకలి తీర్చడానికి ముందుకు రావాలని మనం కూడా కోరుకుందాం. ఒక్కో సెలబ్రిటీ కనీసం పది మంది పేద కళాకారులకు సాయం చేసిన.. సినిమా పరిశ్రమలో ఆకలి బాధలు ఉండవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *