ప్రతి ఒక్క హిందువు నిత్యం పాటించ వలసిన నియమాలు

Spread the love

ప్రతి ఒక్క హిందువు నిత్యం పాటించ వలసిన నియమాలు

1. నిలబడి భోజనం చేయకూడదు, త్రిసంధ్యలలో నిద్రించకూడదు.
2. ఆహారం తినే ముందు దైవానికి నివేదన చేయాలి.
3. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు.
4. మూత్ర విసర్జన నిలబడి చేయకూడదు. మూత్ర విసర్జన తరువాత కాళ్ళు కడుక్కొని. పుకిలిన్చి ఇంట్లోకి రావాలి.
5. మలవిసర్జన, మూత్రవిసర్జన తరువాత కాళ్ళు చేతులు ముఖం శుబ్రంగా కడుక్కొని,
ఓం నారాయణాయ నమః,
ఓం గోవిందాయ నమః,
ఓం మాధవాయ నమః
అంటూ తలపై 3సార్లు నీళ్ళు చల్లుకొని ఇంట్లోకి రావాలి.
6. కాలకృత్యముల తరువాత స్నానం చేయకుండా వంట చేయకూడదు.
7. దైవానికి నివేదన చేయకుండా ఆహారం తీసుకోకూడదు.
8. నిలబడి భోజనం చేయకూడదు. వంటి మీద చొక్కా వేసుకుని భోజనం చేయకూడదు.
9. భుజం మీద తువాలు లేకుండా ఆహారం తీసుకోకూడదు. పూజ చేయకూడదు. కనీసం జేబు రుమాలు అయినా భుజం మీద వేసుకుని చేయాలి.
10. ఎవరైనా ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. లేదా పంపులు ఉంటాయి కదా కనీసం చూపించండి. కడుక్కొని లోపలికి వస్తారు. రాగానే నీళ్ళు తాగుతారా అని పొరపాటున కూడా అడగకూడదు. రాగానే మంచి నీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వాలి.
11. ఎవరితోనైనా సరే హిత సంభాషణం మాత్రమే చేయాలి. నోరు ఉందికదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. దీనికి కూడా ఖర్చు ఏమి ఉండదు కదా!
12. భోజన సమయానికి ఎవరైనా అతిధి వస్తే భోజనం పెట్టాలి. అంతేకాని ఎంగిలి చేతితో మీరే గుమ్మం దగ్గరికి వెళ్లి ఎక్కడ లోపలికి వస్తాడేమో అని అక్కడే మాట్లాడి పంపకూడదు.
13. మనసులో ఒకమాట పైకి ఒకమాట మాట్లాడకూడదు. (భోజనం చేస్తారా అని పైకి మాట్లాడి, లోపల! భోజనాల సమయానికి వచ్చి చచ్చాడు. ఇలా మాట్లాడకూడదు.) ఏది మనసులో వుందో అదే మాట్లాడాలి.
14. నిత్య దీపారాధన చేయాలి. ఇలాంటి ఇల్లు లక్ష్మితో కళకళలాడుతుంది.
15. త్రిసంధ్యలలో నిద్రించకూడదు. ఆహారం తీసుకోకూడదు. ప్రయాణం చేయకూడదు. (ఉదయం 5:00 నుండి 5:45, మధ్యాహ్నం 12 నుండి 12:45, సాయంత్రం 5 నుండి :5:45 వరకు త్రిసంధ్యలు అంటారు)
16. ఉదయించే సూర్యుడిని దంత ధావనం (పళ్ళు తోమడం) చేయకుండా, చేస్తూ చూడకూడదు.(సూర్యోదయం కాకముందే లేచి దంతధావనం చేయాలి అని అర్ధం) తూర్పు పడమర నిలబడి పళ్ళు దంతధావనం చేయకూడదు.
17. తిట్టుకుంటూ, ఏదో ఆలోచనలు చేస్తూ వంట చేయకూడదు. మీరు చేసే ఆలోచనలు అన్ని ఆభోజనంలోకి చేరి ఇంట్లో వారిపై ప్రభావం చూపిస్తాయి.
18. తలపై చేతులు పెట్టకూడదు. తలపై మునివేళ్ళతో గోకకుడదు. రుద్దకూడదు. దీనివలన పతనావస్తకి చేరుకుంటారు.
19. ఎడమ చేతితో పొరబాటున కూడా తినకూడదు, త్రాగ కూడదు.
ఈ నియమాలను చక్కగా త్రికరణ సుద్దితో క్రమం తప్పకుండా పాటించిన వారికి మనో వాంచ నెరవేరుతుంటుంది. వారి ఇంట సిరి సంపదలకు కొరత ఉండదు. ?

Also READ:   ఉపనిషత్తులు అంటే ఏమిటి?

Updated: July 8, 2019 — 5:18 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *