ప్రిన్స్ ఛార్లెస్‌తో కనికా డేటింగ్.. కరోనా వ్యాప్తిపై అనుమానం.. వారిద్దరి ఫోటోతో ట్రోలింగ్


నిబంధనలు ఉల్లంఘించారని..

కరోనావైరస్ విజృంభిస్తున్న వేళ సింగర్ కనికాకపూర్ లండన్ నుంచి న్యూఢిల్లీకి.. అక్కడి నుంచి లక్నోకు చేరుకొన్నది. అయితే లక్నో ఎయిర్‌పోర్టులో అధికారుల కన్నుగప్పి కరోనా పరీక్షలు చేయించుకోకుండా బయటపడ్డారనేది తొలి ఆరోపణ. ఇక అక్కడ నుంచి నేరుగా సౌతాఫ్రికా క్రికెటర్లు ఉన్న ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లారనేది రెండో ఆరోపణ. అక్కడితో కనికా వ్యవహారం ఆగిందా అంటే.. డైరెక్టుగా పొలిటిషియన్లను ఇరుకున పెట్టేసింది.

 మాజీ సీఎం ఫ్యామిలీ పార్టీకి

మాజీ సీఎం ఫ్యామిలీ పార్టీకి

అదే సమయంలో లక్నోలో మాజీ సీఎం వసుంధరా రాజే తనయుడు దుష్యంత్ సింగ్ ఏర్పాటు చేసిన ఓ విలాసవంతమైన పార్టీలో భుజాలు భుజాలు రాసుకొంటూ తిరగడం.. 400 మందికిపైగా హాజరైన ఆ పార్టీలో కొందరితో సన్నిహితంగా, కలివిడిగా తిరగడం కనిపించింది. ఆ పార్టీ నుంచి నేరుగా దుష్యంత్ పార్లమెంట్ సమావేశాలకు.. రాష్ట్రపతిని కలువడం జరిగింది. దీంతో రాష్ట్రపతి కూడా కరోనా పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

READ:   మనిషి నుంచి కుక్కకు కరోనా వైరస్.. ఎక్కడంటే ? - Adya News
-->

దేశంలో ప్రముఖులకు కరోనా ముప్పు

దేశంలో ప్రముఖులకు కరోనా ముప్పు

దీంతో దేశంలోనే ప్రముఖులందరికీ కనికాకపూర్ కరోనా అంటిస్తున్నారనే ఆరోపణలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇదే సమయంలో ప్రిన్స్ ఛార్లెస్‌కు కరోనా వ్యాధి సోకిందనే వార్తలు రావడంతో ఆయనకు కూడా ప్రాణాంతక వ్యాధిని సోకించేలా చేసిందని వారిద్దరు కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు.

ప్రిన్స్ ఛార్లెస్‌తో కనికాకపూర్

ప్రిన్స్ ఛార్లెస్‌తో కనికాకపూర్

అయితే కనికాకపూర్ తాజా పర్యటనలో ప్రిన్స్ ఛార్లెస్‌ను కలుసుకోలేదు. అయితే వారిద్దరు కలిసి దిగిన ఫోటో మాత్రం 2015లో లండన్‌లోని రాయల్ ప్యాలెస్‌లో జరిగిన విందులో కలిసిన ఫోటో అనే విషయం నిర్ధారణకు వచ్చింది. దాంతో పాపం కనికా కపూర్ ప్రాణాలతో బతికిపోయింది. లేకపోతే ఈ సింగర్ పరిస్థితి విదేశీ స్థాయిలో మరింత దారుణంగా మారేదేమో.

READ:   రవివర్మ గీసిన చిత్రాలు నేటి తారల్లా మారిపోయాయి.. ఫోటోలు వైరల్
-->

లక్నో క్వారెంటైన్‌లో కనికా

లక్నో క్వారెంటైన్‌లో కనికా

ప్రస్తుతం కనికాకపూర్ లక్నోలోని సంజయ్ గాంధీ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని క్వారంటైన్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా తనను సెలబ్రిటీగా ట్రీట్ చేయడం లేదని నానా యాగీ చేయడంతో వైద్యులు, అధికారులు ఆమెపై భగ్గమన్నారు. నీవేమీ సెలబ్రిటీ కాదు.. నీవు పేషంట్ మాదిరిగానే ఉండాలని హెచ్చరించారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అనే విషయం తేలడంతో ఇంకొన్నాళ్లు ఆమె హస్పిటల్‌కే పరిమితం కావాల్సి వస్తున్నది.

READ:   టీమిండియా స్టార్ క్రికెటర్ ను పెళ్ళి చేసుకోబోతున్న హీరోయిన్ అనుష్క.... - All Time Report