బటర్‌ చికెన్‌కి ఆ రుచి ఎలా

 

బటర్‌ చికెన్‌కి ఆ రుచి ఎలా..!

మావారి ఉద్యోగరీత్యా కొన్నాళ్లు దిల్లీలో ఉన్నాం. అక్కడ బటర్‌ చికెన్‌ భలే ఉండేది. అలాంటి రుచి ఇంట్లో ఎంత ప్రయత్నించినా రావట్లేదు.

బటర్‌ చికెన్‌కి ఆ రుచి ఎలా వస్తుంది?
– యామిని, హైదరాబాద్‌

బటర్‌ చికెన్‌ అన్ని నగరాల్లో ప్రాచుర్యంలో ఉన్న వంటకమే. దీన్నే ముర్గ్‌ మఖని అని కూడా అంటారు. దిల్లీ మోతిమహల్‌లో చేసే బటర్‌చికెన్‌కి బోలెడు గిరాకి.

ఇంతకీ దీనికి ఈ రుచి ఎలా వస్తుందని అడిగారు కదా!

బటర్‌ చికెన్‌ తయారీలో… డబుల్‌ మారినేషన్‌ చేసుకోవాలి. బటర్‌ చికెన్‌ కోసం బోన్‌లెస్‌ చికెన్‌ అయితే బాగుంటుంది. ఇలా తీసుకున్న తీసుకున్న చికెన్‌కి మొదట మారినేషన్‌ కోసం చెంచా నిమ్మరసం, ఉప్పు, కారం కలిపి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. రెండో మారినేషన్‌ కొచ్చేసరికి కొద్దిగా కసూరిమేతి, పసుపు, గరంమసాలా, చెంచా నూనె, తగినంత అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పెరుగు వేసి మారినేషన్‌ చేసుకోవాలి. దీన్ని తక్కువలో తక్కువగా ఆరుగంటలు ఉంచితేనే బటర్‌చికెన్‌కి ఆ రుచి వస్తుంది. రాత్రి మారినేట్‌ చేసి ఫ్రిజ్‌లో ఉంచి తెల్లారాక వండుకుంటే ఆ రుచి చాలా బాగుంటుంది.

Related:   🌼 ఆపిల్ కిచిడీ🌼

ఇంట్లో వండేటప్పుడు చాలామంది నూనె వాడేస్తారు కానీ… బట్టర్‌ అంటే వెన్నని తప్పనిసరిగా వాడాలి. నెయ్యితో చేస్తే వెగటుగా ఉంటుంది. దీనికోసం చేసే గ్రేవీని మకనీ గ్రేవి అని అంటారు. దాన్ని ఎలా చేసుకోవాలంటే… నాలుగు టమాటాలు, వేణ్నీళ్లలో వేసి తీసిన పది బాదంపప్పులు కానీ జీడిపప్పులు కానీ ఉండాలి. పండిన ఎర్రని టమాటాలు తీసుకుని వాటిపై చాకుతో ప్లస్‌ మార్క్‌ పెట్టాలి. వీటిని వేడినీళ్లలో వేసి తీయాలి. ఇలా చేస్తే దానిపై ఉండే చర్మం సులభంగా వచ్చేస్తుంది. లోపల విత్తనాలు కూడా తీసేసి వాటిని గుజ్జు చేయాలి. పచ్చ యాలకులు, లవంగాలు, చిటికెడు మెంతిపొడి, పంచదార కూడా వాడతారు. అవెన్‌లో రాత్రంతా మారినేట్‌ చేసి ఉంచిన చికెన్‌ని కొద్దిగా గ్రిల్‌ చేసుకోవాలి. అవెన్‌లో లేకపోతే పెనంమీద బటర్‌ వేసుకుని ఎక్కువ మంట మీద చుట్టూ తిప్పుతూ చికెన్‌ ముక్కలని కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్‌ బయట కరకరలాడుతూ లోపల జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో పాన్‌ పెట్టుకుని అందులో బట్టర్‌ వేసుకుని దాల్చినచెక్క, లవంగాలు, పచ్చ ఇలాచీలు వేసుకుని కొద్దిగా అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసుకుని కమ్మని వాసన వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఇందులో టమాటా గుజ్జు వేసుకోవాలి. దానిలో ఉప్పు, కారం, అరచెంచా పంచదార కూడా వేసుకోవాలి.ఆపై కొద్దిగా మెంతిపొడి, జీడిపప్పు పేస్ట్‌ వేసుకోవాలి.

Related:   బెంగుళూరు వంకాయ తో పచ్చడి

ఇందులో కసూరిమేతి, గరంమసాలా వేసుకున్నాక ముందుగా గ్రిల్‌ చేసుకున్న చికెన్‌ ముక్కలు వేసి ఉడికించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *