బీరకాయ పచ్చడి

బీరకాయ పచ్చడి .

ఈ పచ్చడి బాగా రుచిగా ఉండాలంటే రోటిలో చేసుకుంటేనే బాగుంటుంది .

మేము రోటిలో మెత్తగా చేసుకున్నాము . మీరు కొంచెం కచ్చా పచ్చగా నూరుకోండి .

చాలా రుచిగా ఉంటుంది .

మేము బీరకాయ పై చెక్కు తీసి పచ్చడి చేసుకున్నాము .

మీరు ఇష్టమైతే చెక్కుతోనే ముక్కలుగా తరిగి చేసుకోండి .

కావలసినవి .

లేత బీరకాయలు — 3 పై చెక్కు తీసుకుని ముక్కలుగా తరుగు కోవాలి .
పచ్చి మిర్చి — ఎనిమిది .
చింతపండు — మూడు రెబ్బలు . విడదీసి కొద్దిగా నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి .
పసుపు — కొద్దిగా
ఉప్పు — తగినంత
కొత్తిమీర — చిన్న కట్ట

Related:   నిమ్మకాయ రవ్వ పులిహోర

పోపునకు .

ఎండుమిర్చి — 5
మినపప్పు — స్పూను
ఆవాలు — అర స్పూను
మెంతులు — కొద్దిగా
జీలకర్ర — పావు స్పూను
ఇంగువ — కొద్దిగా
నూనె — నాలుగు స్పూన్లు

తయారీ విధానము .

ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే బీరకాయ ముక్కలు , పచ్చిమిర్చి , కొద్దిగా పసుపు మరియు తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఓ అయిదు నిముషాల పాటు ముక్కలను బాగా మగ్గ నివ్వాలి .

తర్వాత విడిగా ప్లేటులోకి తీసుకోవాలి .

స్టౌ మీద తిరిగి బాండీ పెట్టి మిగిలిన నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు, మినపప్పు , జీలకర్ర , ఆవాలు మరియు ఇంగువ వేసుకుని పోపు వేయించుకోవాలి .

Related:   సజ్జప్పాలు / సజ్జ పూరీలు / సజ్జ భక్ష్యాలు

చల్లారగానే ముందుగా రోటిలో ఎండుమిరపకాయలు , కొద్దిగా ఉప్పు , తడిపిన చింతపండు వేసి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .

తర్వాత మగ్గిన బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి మరియు కొత్తిమీర వేసి ఒకసారి కచ్చాపచ్చాగా బండతో నూరుకుని వేరే గిన్నెలో కి తీసుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే బీరకాయ పచ్చడి అన్నం లోకి సర్వింగ్ కు సిద్ధం .

ఈ పచ్చడి వేడి వేడి దోశెలలోకి కూడా బాగుంటుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *