బెంగుళూరు వంకాయ తో పచ్చడి

బెంగుళూరు వంకాయ తో పచ్చడి .

కావలసినవి .

బెంగుళూరు వంకాయలు — రెండు
పచ్చి మిరపకాయలు — 8
కొత్తిమీర — ఒక కట్ట
పసుపు –కొద్దిగా
ఉప్పు — తగినంత
కరివేపాకు — రెండు రెమ్మలు.
చింతపండు — చిన్న నిమ్మకాయంత . కొద్ది నీటిలో తడిపి ఉంచుకోవాలి .

పోపునకు .

నూనె — నాలుగు స్పూన్లు
ఎండుమిరపకాయలు — 8
మెంతులు — పావు స్పూను
మినపప్పు — స్పూనున్నర
జీలకర్ర — పావు స్పూను
ఆవాలు — అర స్పూను
ఇంగువ — కొద్దిగా .

తయారీ విధానము .

ముందుగా బెంగుళూరు వంకాయలు కడిగి చెక్కు తీసి ముక్కలుగా తరుగు కోవాలి .

Related:   నల్లేరు పచ్చడి

స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే తరిగిన వంకాయ ముక్కలు , పచ్చిమిర్చి , కొద్దిగా పసుపు , కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ముక్కలను బాగా మగ్గనిచ్చి దింపి వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .

ఇప్పుడు మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేగగానే దింపు కోవాలి .

పోపు చల్లారగానే ముందుగా మిక్సీ లో ఎండుమిరపకాయలు , చింతపండు మరియు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .

Related:   గ్రిల్డ్‌ పనీర్

తర్వాత వంకాయ ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మరోసారి మెత్తగా మిక్సీ వేసుకోవాలి.

చివరలో మిగిలిన పోపు మరియు కొత్తిమీర వేసి ఒకే ఒకసారి మి వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

అంతే . ఎంతో రుచిగా ఉండే బెంగుళూరు వంకాయలతో రోటి పచ్చడి చపాతీలు , దోశెలు మరియు అన్నం లోకి సర్వింగ్ కు సిద్ధం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *