బొంబాయి  చట్నీ

బొంబాయి  చట్నీ  .
కావలసినవి .
శనగపిండి  —  మూడు స్పూన్లు

చింతపండు  —  ఉసిరి కాయంత

నీళ్ళలో  పది నిముషముల  ముందు  నానబెట్టి  పల్చగా   గ్లాసుడు  రసం  తీసుకోవాలి .
పచ్చిమిరపకాయలు  —  5  .
ముక్కలుగా  తరుగు కోవాలి.
ఉప్పు   —  తగినంత
పోపునకు .
నూనె  —   రెండు స్పూన్లు

పచ్చి శనగపప్పు  —  స్పూనున్నర .

మినపప్పు  —  స్పూను

జీలకర్ర   —  పావు స్పూను

ఆవాలు  —  అర  స్పూను

కరివేపాకు  —  రెండు  రెమ్మలు.

పసుపు  —  కొద్దిగా .
తయారీ  విధానము .
ముందుగా  సిద్ధంగా  ఉంచుకున్న  చింతపండు   రసంలో  శనపిండి  , పసుపు,  తగినంత  ఉప్పు వేసుకుని  అవసరమయితే  మరో పావు  గ్లాసు  నీళ్ళు  పోసుకుని సిద్ధంగా  ఉంచుకోవాలి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి   రెండు  స్పూన్లు  నూనె  వేసి  నూనె బాగా కాగగానే   వరుసగా   ఎండు మిరపకాయలు ముక్కలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు  , పచ్చిమిర్చి  ముక్కలు  మరియు కరివేపాకు  వేసి  పోపు  వేసుకోవాలి .
పోపు  వేగగానే  సిద్ధంగా  ఉంచుకున్న   శనగపిండి నీళ్ళను  పోపులో  పోసుకుని  అట్ల కాడతో బాగా  కలుపు తుండాలి .
అయిదు  నిముషములు  అవ్వగానే  శనగపిండి  నీళ్ళలో  బాగా  ఉడుకుతూ  దగ్గర  పడగానే  దింపుకోవాలి.
ఈ పచ్చడిలో  శనగపిండి ఎక్కువైతే  గట్టిగా  ఉంటుంది  .
అంత  రుచిగా  ఉండదు .
కొంచెం  పల్చగా  ఉంటేనే  బాగుంటుంది.
ఈ పచ్చడి  వేడిగా  తింటేనే  బాగుంటుంది.
నాలుగు  గంటల  కంటే  నిల్వ  ఉండదు.
వేడిగా  ఈ  పచ్చడి  ఇడ్లీ, దోశెలు, వడలు  లోకి  బాగుంటుంది .

Related:   పెసర పప్పు పచ్చడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *