బ్రహ్మ ముహూర్తం.. బ్రహ్మాండ సమయం

0
110

• బ్రహ్మ ముహూర్తం.. బ్రహ్మాండ సమయం 
ఏదైనా పని చేస్తే ముహూర్తం చూసుకోవడం చాలా మందికి అలవాటు. అది ఎంత వరకు సరైనదనేది పక్కన పెడితే చదువుకునే పిల్లలకు బ్రహ్మ ముహూర్తమే బ్రహ్మాండ సమయం. తెల్లవారుజామున 4-7 గంటల వేళ చదువుకోవడం ఉత్తమం. ఇందుకు శాస్త్రీయమైన కారణముంది. ఆ సమయంలో పిల్లల మెదడు 100శాతం ఉత్తేజితమై ఉంటుంది. ఆ సమయంలో పరిసరాలు నిశ్శబ్దంగా ఉండటంతోపాటు ఆక్సిజన్‌ స్థాయులు అధికంగా ఉంటాయి. 
* ఆ సమయంలో చదువుకోవడానికి కూర్చునే ముందు శరీరాన్ని సన్నద్ధం చేయాలి. ఒక నిమిషం పాటు స్కిప్పింగ్‌ లేదా జాగింగ్‌ చేయాలి. అలా చేయడం ద్వారా రెండు నాసికా రంధ్రాలు బాగా తెరుచుకొని తగినంత గాలి పీల్చుకోవచ్చు. కావాల్సినంత గాలి అందితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. 
* మంచం మీద, లేదా పరుపు మీద చదవడం నిషేధించాలి. అలా చేస్తే తొలుత కాళ్లు చాపాలనిపిస్తుంది. తర్వాత కొంత సేపటికి పడుకోవాలనిపిస్తుంది. అందుకే నేలపై కానీ, కుర్చీలో గానీ కూర్చుని చదవాలి. 
* విద్యుత్తు దీపం తలపై ఉండేలా చూడాలి. లేదంటే రీడింగ్‌ ల్యాంప్‌ పెట్టుకోవాలి. అలా చేస్తే ఇతరులకు ఇబ్బంది ఉండదు. 
* చదివినప్పుడు తప్పనిసరిగా కొంత శబ్దం వచ్చేలా అంటే తనలో తనకే వినిపించేలా చదువుకోవాలి. 
* తనకు తానుగా చర్చించే పద్ధతి శ్రేయస్కరం. అలా తమంత తాముగా చర్చించుకోగలిగితే 30-50శాతం జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

Also READ:   శ్రీ గరుడ పురాణం 5వ అధ్యాయము చివరి భాగము