భక్తకన్నప్ప

0
113

భక్తకన్నప్ప

భక్తకన్నప్ప శివ భక్తుడు . అతనికి తిన్నడు అని పేరు వుండేది . అతను శ్రీకాళహస్తి పరిసర ప్రాంతపు అడవులలో జంతువులను వేటాడుతూ ఉండేవాడు .అదే అతని జీవన వృత్తి . ఒకరోజు తిన్నడు అడవిలో సంచరించుచుండగా అతనికి శివలింగం కానవచ్చింది . అప్పటినుండి ఆ శివలింగానికి నిత్యం పూజలు గావించుచుండెడి వాడు .తిన్నడు శివలింగమునకు చేయు పూజ బహువిచిత్రముగా ఉండెడిది . అతను నోటితో జలమును ఉమ్మి శివలింగమునకు అబిషేకించెడి వాడు . అంతేకాక తాను వేటాడిన అడవిపంది మాంసమును లింగమునకు నైవేద్యంగా పెట్టుచుండేడివాడు .ఇలా ప్రతిరోజు శివపూజ చేయనిదే వుండేడి వాడు కాడు .

Also READ:   చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం

ఒకరోజు శివుడు తిన్నడి యొక్క భక్తి ని పరీక్షించదలచాడు . తిన్నడు శివపూజ గావించుచున్నప్పుడు లింగాములోని ఒక కన్ను నుండి కన్నీరు కారడం చూసాడు .వెంటనే అతను బాణం యొక్క మొనతో ఒక కంటిని పెకలించి ఆ కంటికి అమర్చాడు. వెంటనే కన్నీరు కారడం ఆగిపొయింది . వెంటనే లింగములోని మరోకన్ను నుండి కన్నీరు కారగా తన కాలి బొటనవేలు తో కన్నీరు కారుతున్న కంటిని గుర్తుగా పెట్టుకొని మరొక కంటిని పెకలింఛి అక్కడ అమర్చాడు . వెంటనే శివుడు ప్రత్యక్షమై అతడికి శాశ్వతమైన ముక్తిని ప్రసాదించాడు .తన కన్నులను శివుడికి ఇచ్చినందువల్ల తిన్నడు కన్నప్పగా పేరుగాంచాడు

Also READ:   విదుర నీతి

Please View My Other Sites