భారత వైద్య విధానంనందు రసౌషదాల ఉపయోగం

Spread the love

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:

భారత వైద్య విధానంనందు రసౌషదాల ఉపయోగం.

***************************
క్రీస్తుశకం 3 , 4 శతాబ్దాలు కాలంనాటి వాగ్బాటాచార్యుని కాలం వరకు రసౌషదాలు అంతగా ప్రాచుర్యంలో లేవు . అసలు ముందు మీకు రసౌషదాలు అంటే ఏమిటి ? వాటిని ఎందుకు ఉపయోగిస్తారు ? అనే విషయాలు మీకు తెలియచేస్తాను . అందరూ ఆయుర్వేదం అంటే మూలికలు , చూర్ణాలు , కషాయాలు అని మాత్రమే అనుకుంటారు .

కాని ఆయుర్వేదం లో చాలా తక్కువ మందికి తెలిసిన మరొక విభాగం ఉంది. అదే “రసౌషద” విభాగం. ఈ విభాగంలో పాదరసం , బంగారం , వెండి , రాగి,లోహము,అభ్రకం , వజ్రం వంటి లోహాలని ఉపయోగించి వాటిని సరైన పద్దతిలో పుఠం పెట్టి వాటి యొక్క లోహాలక్షణాలని పోగొట్టి శుద్ది చేసి ఔషదాలుగా మార్పుచేయడమే రసౌషద విధానం .

ఈ విధానం లో పాదరసాన్ని శుద్ది చేసి రోగి అవసాన దశలో ఉన్నప్పుడు శుద్ధ పాదరసాన్ని సరైన మోతాదులో ప్రయోగిస్తే అల్లోపతి వైద్యవిధానంలో వాడే ఇంజక్షన్ కంటే వేగం గా పనిచేసి రోగి యొక్క ప్రాణాన్ని నిలబెట్టును.
ఔషధాలలో భస్మాలు వాడినపుడు చాలా వేగవంతమైన ఫలితాలు చూస్తున్నాను.
భస్మాలలో రాజు వంటిది స్వర్ణభస్మము సేవన చేయువానికి అమితమయిన బలము కలుగును
రసౌషధాలకు మూల పురుషుడు సిద్దనాగార్జునుడు అని చెప్తారు.  నిత్యనాధ సిద్దుడు రాసిన రసరత్నాకరం అను గ్రంథం నందు ఈ రసవాదం , ఔషదాలు , రత్నాలని భస్మాలుగా చేయుట మొదలగు వాటి గురించి చక్కని వివరణ ఉన్నది.
మన ప్రాచీనులు ఈ రసాలని మూడు రకాలుగా వర్గీకరణ చేశారు . అవి
*  మహారసములు .

Also READ:   గ్యాస్ , అసిడిటీ , అజీర్ణం లను వెంటనే తగ్గించుకునే సులువైన ఇంటి వైద్యం

 

*  ఉప రసములు .
*  సాదారణ రసములు .
పైన చెప్పిన వాటిలో అని రకాల ఖనిజాలను చేర్చి వాటిని వాటి యొక్క లక్షణాలుగా విభజించారు .
ఇటువంటి రససిద్ధులకు దక్షిణభారత దేశంలో తమిళనాడు ప్రసిద్ది. తమిళనాడులో ఎక్కువుగా రసాలను ఉపయోగించి వైద్యం చేసేవారు ఎక్కువ. నేను కూడా  మా పూర్వీకుల నుంచి వచ్చిన రసౌషధాలు మూలికల సమ్మేళన వైద్యాన్ని  అనుసరించూచు వాటితోనే అసాధ్య వ్యాధులు నయం చేయ గలుగుతున్నాను. రసౌషదాల గురించి మాపూర్వీకులవద్ద అనుభవం సంపాదించాను.  ఇప్పుడు నేను మూలికలతో పాటు స్వర్ణ భస్మం , అభ్రక భస్మం , రజత భస్మం , ముత్యభస్మం , శతపుటి అభ్రకభస్మం , కాంత భస్మం,లోహభస్మం వంటి రసౌషదాలను విరివిగా వాడుతున్నాను . ఖరీదు ఎక్కువ అయినను కూడా ఫలితం తొందరగా వస్తుంది. ఈ రసౌషదాలలో పాదరసం ,స్వర్ణము ప్రధానం అయినవి   ఉపయోగించి కాయసిద్ది అనగా ముసలితనం రాకుండా నిలుపుచేయగలము .ప్రత్యేకంగా అద్భుతమైన ఫలితాన్ని రసౌషదాలలో ప్రధానం అయిన పాదరసం,స్వర్ణభస్మం ఉపయోగించి అధిక ఫలితాలు పొందుతున్నాను.
అసలు రసవిధానం వైద్యం కోసమే ప్రవేశపెట్టబడినది. రససిద్దులకు లోహాన్ని శుద్ధిచేయటం , దేహాన్ని శుద్ధిచేయడం అనగా దేహంలోని టాక్సిన్స్, వ్యర్థాలను పూర్తిగా బయటకి పంపే విధానం . ఈ లోహశుద్ధి పాదరసాన్ని పరీక్షించుట ద్వారా తెలియును . అనగా ఒక ఖనిజం (మెటల్)  ను తీసుకుని దానియందు పరమాణువులు రెండోవదగు ఉచ్చ తరగతికి చెందిన ఖనిజం ( metal) గా మార్చు శక్తి పాదరసంకి కలదు. రససిద్దులు పాదరసం శివుని వీర్యంగా, గంధకం పార్వతీదేవి రజస్సుగా వారు భావిస్తారు.

Also READ:   సబ్జా గింజల్లోని ఔషధ గుణాలేంటి..?

. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న మొండి వ్యాధులకు ఈ రసౌషదాలు చక్కని పరిష్కారం .  నపుంసకత్వం,నరాలబలహీనత,సంతానలేమి, పక్షవాతము,మున్నగు అసాధ్యరోగలకు మంచి పరిష్కారం .
గుండె రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు,ఎయిడ్స్,క్యాన్సర్ సమస్యకి వాడే ఔషధాల్లో వజ్రభస్మం వాడటం వలన రోగి తొందరగా కొలుకుంటాడు.
ఈ విధంగా చెప్పకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. కాని చాలా మందికి రస ఔషదాలు , రసవాదం గురించి పరిచయం లేదు వారు అర్థం చేసుకొనుటకు ఇబ్బంది ఎదురు అగును. కావున ఇది చదివినవారిలో రసవాదులు ఉంటే వారికి మాత్రం సంపూర్ణంగా అర్థం అగును.
గమనిక  –

Also READ:   Royalties University - How to Earn Royalties from Intellectual Property

త్వరితగతిన ఫలితాలు సాదించాలి అంటే రసౌషదాలు వాడుకోండి. కాని అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వారి సూచనలను అనుసరించి ఔషద సేవన చేయండి అద్బుతమైన ఫలితాలు పొందగలరు. వీటి ఖరీదు ఎక్కువుగా ఉంటుంది. కాని ఫలితం తొందరగా వస్తుంది.

Updated: April 16, 2019 — 3:20 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *