భోజనానికి అతిథులను మన ఇంటికి ఆహ్వానించినప్పుడు

భోజనానికి అతిథులను మన ఇంటికి ఆహ్వానించినప్పుడు ——

భోజనాలూ – బహుజనాలు ఎవరినైనా మన ఇంటికి భోజనానికి ఆహ్వానించినప్పుడు పాటించ వలసిన ముఖ్య ధర్మాలు

1) ఇంట్లోని ఒక వ్యక్తి వారిని entertain చేసే కార్య క్రమాన్ని చూసుకోవాలి. దానివల్ల అతిథికి వారిచ్చే ఆతిధ్యం మీద గౌరవం పుడుతుంది.

2) అతిధి భోజనానికి వచ్చినప్పుడు ఇంట్లో గిన్నెలు , గ్లాసుల చప్పుళ్ళు చెయ్యరాదు. దానివల్ల అతిధి తను రావడం ఇంట్లో ఆడవారికి ఇష్టం లేదేమో అన్న అనుమానం రావచ్చు.

3) సాద్యమైనంత వరకు అతిధి రావడానికి ముందే వంట కార్య క్రమం పూర్తీ చెయ్యాలి.

4) భోజనానికి కూర్చునే ముందు కాఫీ లాంటి పదార్ధాలు ఇచ్చి వారి ఆకలిని చంపరాదు.

5) వండిన పదార్ధాలన్నీ ముందుగానే టేబుల్ మీద డిష్ లలో అమర్చి వుంచాలే తప్ప ఒక్కొక్క ఐటమ్ లోపలనుండి తీసుకొచ్చి సర్వ్ చెయ్యరాదు.

6) పదార్ధాలు వేసుకోవడానికి వీలుగా ప్రతి డిష్ దగ్గర ఒక గరిట ఉంచాలి. వట్టి స్పూన్లు పెడితే ఎక్కువెక్కువ పదార్ధాలు వేసుకోవద్దని చెప్పినట్టుగా అర్ధం వస్తుంది.

7) ఏ ఏ పదార్ధాలు టేబుల్ మీద ఉంచబడ్డాయో ఒకసారి అక్కడ కూర్చున్న వారికి చెప్పి కావాల్సినవి మొహమాటం లేకుండా తినమని చెప్పాలి.

Related:   ఇంద్రుని దగ్గర సీక్రెట్ కెమేరా.._* *_అక్కడ జరిగిన విశేషాలు Tv 9లో యథాతదంగా

8) చాలా మందికి టేబుల్ కు అడ్డంగా నిలబడి వడ్డిస్తూ ఉండటం నచ్చదు. అది వారి వారి ఇష్టానికి వదిలివెయ్యాలి. వద్దు వద్దు అంటున్నా బలవంతాన వడ్డించడానికి ప్రయత్నం చెయ్యకూడదు.

9) భోజనం మొదలు పెట్టాక మంచి నీళ్ళు పెట్టటం కాకుండా ముందుగానే గ్లాసులు, వాటి పక్కన ఒక జగ్ తో నీళ్ళు ఉంచ వలెను. వాటిల్లో నలకలు , ఇతర పదార్ధాలు ఉండకుండా చూసుకోవాలి.

10) పదార్ధాలలో ఉప్పూ, కారం ఇతర దినుసులు సరిగ్గా వున్నాయో లేదో చూసుకుని టేబుల్ మీద పెట్టడం చాలా అవసరం. ఎటువంటి పరిస్తితులలోనూ అతిథుల ముందు చేత్తో తీసేయడం లాంటి పనులు చెయ్యకండి.

11) ఇంకాస్త వడ్డించనా అంటూ వద్దన్నా బలవంతాన వెయ్యడానికి ప్రయత్నం చెయ్యకూడదు. చాలా మంది కొద్ది కొద్దిగా అన్ని ఐటమ్స్ ఆస్వాదించడానికి ఇష్టపడతారు. మారు వడ్డించడం వల్ల కొన్ని ఐటమ్స్ వదిలేసే అవకాశం ఉంది.

12) చాలా మంది ఆహారాన్ని మెల్లి మెల్లిగా తింటూ వుంటారు. అటువంటప్పుడు హోస్ట్ తొందర పడక వారిని అనుసరించాలే తప్ప గబ గబా తినేసి చేతులు కడిగేసుకుంటే గెస్ట్ ను అవమానించి నట్టవుతుంది. అప్పుడు గెస్ట్ కూడా తొందర తొందరగా భోజనం ముగించడానికి ఆలోచిస్తాడు.

Related:   ఎన్నో విలువైన పుస్తకాలూ ఉచితంగా నెట్ లో లభిస్తున్నాయి .. వాటిలో కొన్ని ముఖ్యమైన పుస్తకాలూ క్రింద ఇవ్వడం జరిగింది

13) భోజనం చేసేటప్పుడు ఆహ్లాద కరమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి తప్ప అక్కడ వివాదాస్పదమైన విషయాలు గురించి గాని, రోగాల గురించి గాని, అక్కడ లేని మూడవ వ్యక్తి గురించి గాని మాటలాడటం ఎటువంటి పరిస్తితి లోనూ మంచిది కాదు. ముఖ్యంగా అతిధి గురించి చెడు అసలు మాటలాడ కూడదు.

14) అతిధి ఏ ఐటమ్ గురించైనా ఆసక్తి చూపించక పోతే వంట నచ్చ లేదా/ సరిగ్గా వుడికినట్టు లేదు / షాప్ వాడు మోసం చేసేసాడు / హడావిడి అయిపోయింది /మా వంటలు మీకు నచ్చవేమో /ఉప్పూ ఎక్కువైనట్టుంది /వదిన గారు నా కన్నా బాగా చేస్తారు కదూ /మొహమాటం పడొద్దు /శుభ్రంగా తినండి /ఏదీ వేస్ట్ చెయ్యకండి / లాంటి మాటలు వాడొద్దు.

15) ఇంట్లో చిన్న పిల్లలుంటే మాటికి మాటికి టేబుల్ దగ్గరకు రానీయకుండా చూడాలి.

16) టీవీలు, రేడియో లు భోజనం చేస్తున్నప్పుడు పెద్ద సౌండ్ తో పెట్టొద్దు. చాలా మంది భోజనం ప్రశాంతమైన వాతావరణంలో చేయ్యాలనుకుంటారు.

17) భోజనం ముగించాక వారికి చేతులు శుభ్రం చేసుకోవడానికి సరిపడా నీళ్ళు, ఒక టవల్ దగ్గరలో ఉండే టట్లు చూసుకోవాలి.

Related:   ఇంత‌కీ గాంధీని చంపిన‌ గాడ్సే ఎవ‌రు?

18) చివరగా వక్కపొడి, లాంటి ఐటమ్ టీ పాయి మీద వుంచడం మర్చి పోకూడదు. వాళ్ళు మనకు కృతజ్ఞతలు చెప్పే ముందుగానే మనం వాళ్ళు మన ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించి నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

19) భోజనం అయ్యాక కొంత రెస్టు తీసుకునే ఏర్పాటు చెయ్యడం కూడా మంచిది.

20) అతిధి అవసరమైన టాబ్లెట్స్ వేసుకున్నారా అనేది భోజనానికి ముందు , తర్వాత కనుక్కుంటే అతిధి సంతోషిస్తాడు..

21) తినేవారి తింటున్నపుడు తిండివైపు చూడకూడదు

22 ) చివరగా , ముఖం మీద చిరునవ్వుతో వారికి వీడ్కోలు పలకండి.

***** అన్నదాతా సుఖీభవ *****

***** అతిథి దేవోభవ *****

చివరగా అతిథి తృప్తిగా భోజనము చేస్తే ఆనందించండి.

ముదరష్టపాడు వండిన వన్నీ తినేసాడు. రేపు మళ్ళీ వండుకోవాలి అని కన్నీళ్ళు పెట్టుకోవద్దు .

అలాంటప్పుడు ఎవర్నీ భోజనానికి పిలవక పోవడమే ఉత్తమోత్తమం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *