మనలోని శక్తులు

0
116

మనలోని శక్తులు

***మనల్ని నడిపించే మనలోని శక్తులు?
మానవుని దేహంలోని సుక్ష్మ చక్రాలు , ఆధారం స్ధానంలో మూలాధారము , అందుపైన స్వాదిష్టనము , నాభి వద్ద ఉండే మణిపురము, హృదయానికి చేరువలో అనాహతము, కంఠం వద్దనున్న విశుద్ధము , రెండు కను బొమ్మల మధ్య ఉండే ఆజ్ఞ చక్రము, అలాగే బ్రహ్మ రంధ్రం వద్ద నుండే సహస్రారము. ఇవే మానవుడ్ని నడిపే అద్భుత శక్తులు, శరీర శక్తులు , అధిపతులు .

*****షష్టిపూర్తిని ఎందుకు జరుపుకుంటారు?
అరవై ఏళ్ళు నిండిన వారు జరుపుకోవాలని పెద్దలు సాంప్రదాయాన్ని పెట్టారు. ఆ సాంప్రదాయం వెనుక ఓ జోతిష్య శాస్ర రహస్యం ఉంది. ‘ఉగ్రరధ’ అనే భయంకర దోషం అరవై నిండగానే మనిషిని ఆవహిస్తుంది .
దాని వల్ల భయంకర శోకము. అందుకే షష్టి పూర్తి వేడుకల్లో భాగంగా ‘ఉగ్రరధ’ సంబంధిత కార్యక్రమాన్ని కూడా జరిపించుకుంటారు.
అలాగే డెబ్భై ఎనిమిదేళ్ళు దాటినా వారు , ఇంకా ఎనభై నాలుగు దాటినా వారు శాంతి కార్యక్రమాలను జరిపించుకుంటారు.

Also READ:   శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం

****వధూవరులు తలపై పెట్టుకునే జీలకర్ర బెల్లం పరమార్థం ఏమిటి?
వివాహతంతులో వధూవరులు ఒకరితల పై మరొకరు పెట్టుకునే జీలకర్ర బెల్లంపై శక్తి వంతమైన రహస్యం దాగి ఉంది.
జీలకర్ర బెల్లం వలన వధూవరుల జీవశక్తులు ఆకర్షింప బడతాయి . అరచేతిలో ఈ మిశ్రమాన్ని ఎదుటి వారి తలపై పెట్టడం వలన మిశ్రమం ద్వారా వారి చేతుల యందున్న శక్తి ఇరువురి బ్రహ్మరంధ్రాలలోకి ప్రవేశించి సహస్రారచక్రం ద్వారా భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞా చక్రం ద్వారా ఆకర్షక శక్తిని కలుగజేస్తుంది.
హస్తమస్తక సంయోగమే వధూవరులు పెట్టుకునే జీలకర్ర బెల్లంలోని అసలుసిసలు పరమార్థం.

Also READ:   వినాయక వ్రతకల్పం

*******దక్షిణావర్తమైన శంఖములో తీర్థం ఎందుకు అంత శ్రేష్టముగా ఉంటుంది?
శంఖము లక్ష్మీదేవి స్వరూపం . శంఖతీర్థం సేవించటం వల్ల , ఇంట్లో నలువైపులా చల్లటం వల్ల సకల శుభాలు జరుగుతాయని అలా చేయమంటారు. సముద్రంలోంచి వచ్చిన శంఖంలో కాల్షియం అధికంగా ఉంటుంది.
అలాంటి శంఖతీర్థం స్వీకరించటం ద్వారా ఒళ్లునొప్పులు దూరమై ఎముకలు గట్టిపడి శరీరం శక్తిని పుంజుకుంటుంది. అందుకే మన పెద్దలు శంఖ తీర్థం సేవించమన్నది. అలాగే సాలగ్రామ తీర్థాన్ని శంఖం ద్వారా స్వికరిస్తే మరింత ఆరోగ్యం . పుణ్యం .

Also READ:   ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?

*****కాకి తలపై వాలితే అశుభమా ?
కాకి వాలిన వారూ, కాకి కాలి గోళ్ళు తగిలిన వారూ , ముఖ్యంగా శిరస్సు మీద వాలిన వారూ, తప్పనిసరిగా భగవత్ ఆలయానికి వెళ్లి 108 సార్లు ధ్యానం తప్పనిసరిగా చేయాలి.
అలా జరిగినప్పుడు ఒక్కోసారి తలలో ఉండే సున్నిత భాగం ఇబ్బందిపడే అవకాశం ఉంది. అందుకే దైవ ధ్యానం చేస్తే చాలు.

*****నైరుతిలోనే ఆరోగ్యముందా ?
నైరుతి మనకు ఆరోగ్యాన్ని , సౌభాగ్యాన్ని అందిస్తుంది. నైరుతిని అదుపులో ఉంచుకుంటే సకలసంపదలు , భోగాలు లభిస్తాయి.