మనిషి చనిపోయే ముందు కుక్కలు ఎందుకు అరుస్తాయో తెలుసా?

Spread the love

కుక్కలకు మనిషితో ఉన్న బంధం ఈనాటిది కాదు. మన దేశపు సాంప్రదాయంలో కుక్కలని కాల భైరవుడిగా పూజిస్తారు. మనిషితో కలిసి కుక్క జీవించినట్టు ఏ పెంపుడు జంతువూ కలిసి లేదు. కుక్క చనిపోతే ఆ బెంగతో చనిపోయిన యజమానుల కథలు , యజమాని సమాధి వద్దనే ఉండిపోయిన కుక్కల గురించి మనం ఎన్నో విని ఉన్నాం. అలాగే మన మనసు బాగోకపోతే ముందు గుర్తుపట్టేవి కుక్కలే , మన దగ్గరికి వచ్చి పసి పిల్లల్లా ఒళ్ళో వాలిపోతాయి కుక్కలు. అలాగే ఇంటికి దొంగలు రాగానే , ఎవరైనా అనుమాస్పదపు వ్యక్తులు తిరుగుతున్నా కుక్కలు ముందే పసిగడతాయి. అరుస్తాయి.

Also READ:   తెలుగు వారి గుండెచప్పుడు తారక రాముడి జననం 1923 మే 28 వ తేదీన.. మరణం 1996 జనవరి 18

అలాగే కుక్కల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఒక నమ్మకం ఉంది. మనిషి చనిపోయే ముందు కుక్కలు అరుస్తాయి అని అంటారు. వారికి మనిషి ప్రాణం పోయే ముందు యమధర్మరాజుని చూస్తాయని , అందుకే తనకు తెలిసిన వారు గాని ,ఎవరైనా ఉంటె వారిని కాపాడటానికి అరుస్తాయని అంటారు. ఈ విషయం పైనే ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కుక్కలు మనిషి ప్రాణం పోయే ముందు ఎందుకు అరుస్తాయి అన్న దాని సైంటిస్టులు సీరియస్ గా తీసుకుని పరిశోధనలు కూడా చేశారు.

Also READ:   యాత్రలెందుకు?

ఈ విషయం పై ఈ మధ్యనే ఒక సరికొత్త క్లారిటీ వచ్చింది. అమెరికాలోని పెనిస్లేవియా ఇన్స్టిట్యూట్ లో సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో కుక్కల స్పర్శా జ్ఞానం గురించిన విషయాలు తెలిసాయి. అందులో భాగంగా , కుక్కల ముక్కుకి వాసనని కనిపెట్టే శక్తి ఎక్కువ. కొన్ని కొన్ని కుక్కలు కిలోమీటర్ల దూరంలోని వాసనని పసిగట్టిన సంఘటనలు గురించి మనం విని ఉన్నాము. అయితే కుక్కలు , మనిషి చనిపోవడానికి ముందు అతని శరీరంలో జరిగే రసాయనిక చర్యల వల్ల వచ్చే వాసనని పసిగట్టగలవు. కుక్కలకు అలా పసిగట్టగలిగే శక్తి జన్యుపరంగా వచ్చింది. అందుకే కుక్కలు మనిషి చనిపోయే సమయంలో ఇంటి దగ్గర పెద్ద పెద్దగా అరుస్తాయి. కానీ , గాల్లోకి ఎక్కువగా ఎందుకు చూస్తాయి అన్నదానిపై ఇప్పటిదాకా వివరణ లేదు. ప్రాణం పోయే డప్పుడు , గుండె ఆగిపోయే క్షణంలో శరీరంలో విడుదల అయ్యే చిన్నపాటి విద్యుత్తుని అది గమనిస్తోంది అని అన్నారు.

Also READ:   Dear Comrade Trailer: Vijay Deverakonda: ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్.. బాబి, లిల్లీ లవ్‌స్టోరీ - vijay deverakonda's dear comrade theatrical trailer released

ఏది ఏమో , కుక్కలు కూడా ఇలా కాల జ్ఞానం చెప్పేస్తున్నాయి.

Updated: July 16, 2019 — 11:01 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *