మనుష్యుల సంతోషాన్ని నిర్ణయించగల హార్మోన్లు

మనుష్యుల సంతోషాన్ని నిర్ణయించగల హార్మోన్లు నాలుగు ఉన్నాయి..

అవి..

1.ఎండార్ఫిన్స్
2.డోపమైన్
3.సెరొటోనిన్
4.ఆక్సిటోసిన్

ఈ హార్మోన్లని అర్థం చేసుకోవడం మనకి చాలా అవసరం..ఎందుకంటే మన సంతోషానికి ఇవి కారణం కాబట్టి …

మొదటి హార్మోన్ ఎండార్ఫిన్స్ గురించి తెలుసుకుందాం..

మనము వ్యాయామం(exercise) చేసినప్పుడు మన శరీరం ఈ హార్మోన్ ని విడుదల చేస్తుంది ..

ఈ హార్మోన్ మనం వ్యాయామం చేసినపుడు కలిగే నొప్పిని తట్టుకునేందుకు సహకరిస్తుంది…అందుకే మనం మన వ్యాయామాన్ని ఉల్లాసంగా తీసుకోగలము ఎందుకంటే ఎండార్ఫిన్స్ మనకి ఆనందాన్ని కలిగిస్తాయి..

నవ్వితే కూడా ఎండార్ఫిన్స్ చాలా చక్కగా విడుదల అవుతాయి..

మనం రోజుకి కనీసం 30 నిముషాల వ్యాయామం చేయాలి..హాస్యసంబంధిత విషయాలను చదవటం కానీ చూడటం కానీ చేస్తే రోజుకి సరిపడా ఎండార్ఫిన్స్ లభిస్తాయి..

రెండవ హార్మోన్ డోపమైన్..

మనం మన జీవితంలో చిన్నవైనవో పెద్దవైనవో అయిన లక్ష్యాలను సాధిస్తూ ఉంటాము..ఆయా సందర్భాలకు తగినంత డోపమైన్ లభిస్తూ ఉంటుంది..

Related:   Dog Training Tutor

మనకి ఇంటి దగ్గరనో ఆఫీసులోనో ప్రశంసలు దొరికినప్పుడు సంత్రృప్తిగా అనిపిస్తుంది..అది ఈ డోపమైన్ విడుదల అవటం వలననే ..

ఇదే కారణం ఎక్కువ మంది ఇల్లాళ్ళు(housewives) ఆనందంగా ఉండలేకపోవటానికి కారణం తాము చేసే శ్రమకు తగిన గుర్తింపు ప్రశంసలు దొరకక పోవటమే వారి అసంతృప్తికి కారణం …

ఒకసారి మనకు ఉద్యోగం దొరికాక..
కారు
ఇల్లు
కొత్త కొత్త అధునాతన వస్తువులు ..
కొంటాము..
ఆయా సందర్భాలలో ఈ డోపమైన్ విడుదల అవుతుంటుంది, మనం ఆనందపడుతాము..

ఇప్పుడర్ధమైంది కదా మనం షాపింగ్ చేసినప్పుడు మనకి ఆనందంగా ఎందుకనిపిస్తుందో…

మూడో హార్మోన్ సెరెటోనిన్ మన వల్ల వేరొకరు ఆనందపడినప్పుడు, మనం వేరొకరికి ఉపకారం చేసినప్పుడు విడుదల అవుతుంది…

మనం సాటివారకి గానీ ప్రకృతికి గానీ సమాజానికి గానీ మంచి చేయగలిగినప్పుడు సెరిటోనిన్ విడుదల అవుతుంది..

Related:   Stress Reduction: Natural Stress Relief with 8 Minute Meditation

అంతేకాదు..ఒకరి సమస్యలకు, ప్రశ్నలకు ..సలహాలు, సమాధానాలు బ్లాగ్స్ రూపంలోనో ఫేస్‌బుక్ గ్రూపు ల రూపంలోనో ఇవ్వగలిగినప్పుడు కూడా ఈ సెరిటోనిన్ విడుదల అయ్యి ఆనందంగా అనిపిస్తుంది…

అలా ఎందుకంటే మన విలువైన సమయాన్ని మరొకరికి సాయం చేసేందుకు ఉపయోగించడం మనకి సంతోషాన్ని ఇస్తుంది..

చివరి నాలుగవ హార్మోన్ ఆక్సిటోసిన్..మనం తోటివారితో అనుబంధాన్ని పెంచుకుని వారికి దగ్గర అయినప్పుడు విడుదల అవుతుంది..

మనం మన స్నేహితులనో కుటుంబసభ్యులనో ఆలింగనం (hug) చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది…మున్నభాయ్ అనే హిందీ సినిమాలో చెప్పినట్టు నిజంగా, ఒక ఆత్మీయఆలింగనం మంత్రం వేసినట్లుగా మాయ చేసి మనసుని కుదుటపరుస్తుంది…
అదేవిధంగా కరచాలనం, భుజాల చుట్టూ చేయి వేసి భరోసా ఇవ్వటం కూడా చాలా ఆక్సిటోసిన్ ని విడుదల చేయగలదు…

కాబట్టి ..
రోజూ వ్యాయామం ఎండార్ఫిన్స్ కోసం…
చిన్ని చిన్ని లక్ష్యాలను సాధిస్తూ డోపమైన్ కోసం..
తోటివారితో స్నేహంగా ఉంటూ సెరొటోనిన్ కోసం…
మన పిల్లలను ఆలింగనం చేసుకుంటూ ఆత్మీయులను దగ్గరకు తీసుకుంటూ ఆక్సిటోసిన్ కోసం..
జీవించే పద్ధతి ని అలవాటుచేసుకుంటూ ఉంటే ఆనందంగా జీవించగలమ
మనం సంతోషంగా ఉంటేనే మనం మన సమస్యలను సవాళ్ళను బాగా పరిష్కరించుకోగలము..

Related:   మన రక్తపోటు అదుపులో ఉండేందుకు చిట్కాలు

ఇప్పుడర్ధమైందా పిల్లలు చిరాకుగా ఉన్నప్పుడు వారిని దగ్గరకు తీసుకుని లాలించాలి…

అప్పుడు రోజురోజుకి మీ బిడ్డ సంతోషంగా హుషారుగా ఉండగలరు..

1.* ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి…ఎండార్ఫిన్స్

2.బిడ్డల చిన్న పెద్ద విజయాలకు ప్రశంసించాలి…డోపమైన్

3.సాటివారిని కలుపుకుంటూ వారితో సంతోషాలు పంచుకుంటూ జీవించే అలవాటుని మీరు పాటిస్తూ పిల్లలకూ అలవాటు చెయ్యాలి…సెరొటోనిన్

4. మీ బిడ్డ ను దగ్గరకు హత్తుకోండి…ఆక్సిటోసిన్…

జీవితాన్ని ఆనందమయం చేసుకోండి…
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *