Home Bhakti మనో నిగ్రహం

మనో నిగ్రహం

- Advertisement -

మనో నిగ్రహం

జీవితంలో అన్నీ సముత్యలంగా ఉంటూ, దేని గురించీ ఆలోచించాల్సిన అవసరం లేనప్పుడు అయ్యయ్యో! ఎందుకిలా జరిగింది? నాకే ఎప్పుడూ ఏదో లోటని బెంబేలెత్తిపోతాం. అన్నీ ఉంటే విలువ తెలియదు. ఏదైనా లోపిస్తేనే, ఏదైనా దూరమైతే దాని గొప్పతనం తెలిసివస్తుంది.

సృష్టిలో ఎవరెవరికి కావలసిన శక్తులను వారివారికి అందించిన భగవంతుని ఉద్దేశం ఉన్నదానిని సదుపయోగం చేస్తూ, లేనివాటి విలువలను ఎరిగి మసులుకోవాలనే అనేక కోట్ల జీవరాశుల్లో విలక్షణంగా, విభిన్నంగా విలువల వారధిగా మనిషి సృష్టించబడినాడు. కానీ శారీరకంగా, మానసికంగా దుర్వినియోగపరచడంలోనే జీవితాన్ని వృథా చేస్తున్నాడు.

శబ్దాదిభిః పంచభిరే వ పంచ
పంచత్వ మాపుః స్వగుణే న బద్ధాః
కురుంగ మాతంగ పతంగమాన
భంగానరః పంచభిరంబితఃకిమ్

ఒకానొక లేడిపిల్ల వేణుగానానికి భ్రమపడి వలలో చిక్కుపోయింది. ఒక మగ ఏనుగు ఆడ ఏనుగు స్పర్శకు భంగపడి పెద్ద గుంతలో పడిపోయింది. మిడుత అగ్నిజ్వాల మెరుపునకు భ్రమపడి మంటల్లో పడి మాడిపోయింది. చేపపిల్ల ఎరకు ఆశపడి గాలానికి చిక్కింది. తుమ్మెద పూలపరిమళాలకు ఆశపడి పువ్వు ముడుచుకోగా నలిచిపోయింది. ఇవన్నీ జీవాలు. వివేకంతో ఇంద్రియనిగ్రహం పాటించేంత చొరవ చూపలేనివి. శ్రవణ, స్పర్శ, నయన, రస, ఘ్రాణాలనే ఇంద్రియాలు ఒక్కొక్కటిగా ఇన్ని జీవాలను ప్రభావితం చేసి నశింపజేశాయి. మరి పంచేంద్రియాలతో ప్రేరేపితమయ్యే మనిషి పరిస్థితేమిటి? అగమ్యగోచరమే కదా!

మనిషి లోపం వెనుక సమాజ పాత్ర, భగవంతుని నిర్దయే ముఖ్యకారణాలుగా గణించబడతాయి. అది అసహనంగా మారి ఆలోచనాశక్తిని నశింపజేస్తుంది. మనం ఎదుగుతుంటే సమాజం మనల్ని కిందకు లాగేస్తుందని ఆడిపోసుకుంటాం. మన ఇంద్రియాలే మనల్ని కిందకు లాగుతుంటాయి. అలా జరుగకూడదనుకుంటే వాటికి సరైన మార్గాన్ని చూపించాలి. బయట ప్రపంచంలోని మాయ మనల్ని భ్రమలో పడేయడానికి అందంగా కనబడుతుంది. అదే అంత అందంగా ఉంటే దాని వెనకాల ఉన్న నిత్యమైన, శుద్ధమైన, నిజతత్తం ఎంత సుందరంగా ఉంటుంది. ఆ ఊహే అత్యంత మధురం. మనలోని ఇంద్రియశక్తిని బలహీనతగా కాక బలంగా మార్చుకోవాలంటే మనోనిగ్రహం కావాలి. లోక వాస్తవికతను అంతఃచక్షువులతో వీక్షించాలి. అప్పుడే సరైన గమ్యం చేరగలం.

Originally posted 2019-02-07 23:29:08.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

అందంగా జుట్టు పెరగడానికి : ఉసిరికాయ పౌడర్ | How to Use Amla Powder For Hair Growth

ఉసిరికాయ పొడితో జుట్టు సంరక్షణ తలపై పేలవమైన ఆరోగ్యం చాలా జుట్టు సమస్యలకు దారితీస్తుంది. కానీ మీ జుట్టుకు ఉసిరికాయను...
- Advertisement -

కరోనా వైరస్ ప్రభావం నుండి కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిపై వైరస్ మళ్లీ దాడి చేస్తుందా? వాస్తవం ఏమిటి?

తిరిగి రావచ్చు అంతకుముందు, కోరోనావైరస్ కోలుకున్న వారికి వ్యాపించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సంక్రమణ తక్కువగా ఉన్న తరువాతి 2 వారాలకు ఐసోలేషన్ అవసరమని చెబుతారు....

Related News

అందంగా జుట్టు పెరగడానికి : ఉసిరికాయ పౌడర్ | How to Use Amla Powder For Hair Growth

ఉసిరికాయ పొడితో జుట్టు సంరక్షణ తలపై పేలవమైన ఆరోగ్యం చాలా జుట్టు సమస్యలకు దారితీస్తుంది. కానీ మీ జుట్టుకు ఉసిరికాయను...

కరోనా వైరస్ ప్రభావం నుండి కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిపై వైరస్ మళ్లీ దాడి చేస్తుందా? వాస్తవం ఏమిటి?

తిరిగి రావచ్చు అంతకుముందు, కోరోనావైరస్ కోలుకున్న వారికి వ్యాపించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సంక్రమణ తక్కువగా ఉన్న తరువాతి 2 వారాలకు ఐసోలేషన్ అవసరమని చెబుతారు....

Leaky Gut Cure – Fastest Way to Cure Leaky Gut Syndrome

Product Name: Leaky Gut Cure - Fastest Way to Cure Leaky Gut Syndrome Click here to get Leaky Gut Cure - Fastest Way to Cure...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here