మన గురువులు      2500  ,సం.ల   మహవతార్ బాబా

మన గురువులు      2500  ,సం.ల   మహవతార్ బాబా
బాబాజీ 2500 సంవత్సరముగా బ్రతికి వున్నారా ?  మహావతార్ బాబాజీ లాంటి సిద్ధయోగులు ఈనాటికీ నివసిస్తున్న ప్రదేశం ఎక్కడ ఉన్నది?  మహాయోగి, శ్రీ మహావతార్ బాబాజీ గారు  ఇంకా బతికి ఉన్నాడని హిమాలయాల్లోనే ఉన్నాడని నమ్మేవారు చాలామంది ఉన్నారు. తరతరాలుగా భారతీయ సంస్కృతిని రక్షించడంలో తమ శక్తిని ఉపయోగిస్తున్నారని, యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చిన మహావతార్ బాబా తమిళనాడులోని పారంగిపేట్టయ్‌లో క్రీస్తుశకం 203 నవంబర్ 30న జన్మించారు. పాశ్చాత్యదేశాలలో యోగ విద్యకు ప్రాచుర్యం కల్పించిన పరమహంస యోగానంద సహా పలువురు యోగా గురువులు మహావతార్ శిష్య పరంపరలోని వారే. మహావతార్ బాబా అసలు పేరు ఏమిటో చాలాకాలం వరకు ఎవరికీ తెలియదు. అయితే, మహావతార్‌బాబాకు ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగరాజన్ అని మార్షల్ గోవిందన్ (యోగాచార్య ఎం.గోవిందన్ సచ్చిదానంద) తన పుస్తకంలో రాశారు.

.

‘బాబాజీ అండ్ ది 18 సిద్ధ క్రియా యోగ ట్రెడిషన్’ పేరిట రాసిన ఆ పుస్తకంలో మహావతార్ బాబా జీవిత విశేషాలను వెలుగులోకి తెచ్చారు. భోగర్‌నాథర్ శిష్యుడిగా యోగసాధన ప్రారంభించిన మహావతార్ బాబా, తర్వాతి కాలంలో సిద్ధ అగస్త్య వద్ద క్రియాయోగ శిక్షణ పొందారు. బదరీనాథ్ చేరుకుని, అక్కడ క్రియాయోగ సాధన ద్వారా మహావతార్ బాబా సిద్ధి పొందారని ప్రతీతి. అయితే, క్రీస్తుశకం మూడో శతాబ్దికి చెందిన మహావతార్ బాబాను 1861-1966 మధ్య కాలంలో కొన్నిసార్లు ప్రత్యక్షంగా చూసినట్లు యోగా గురువు శ్యామాచరణ లాహిరి, ఆయన శిష్యులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అలహాబాద్‌లో 1894లో జరిగిన కుంభమేళాలో మహావతార్ బాబాను ప్రత్యక్షంగా కలుసుకున్నట్లు లాహిరి శిష్యుడైన యుక్తేశ్వర గిరి తన పుస్తకం ‘కైవల్య దర్శనం’లో రాశారు
అది 30 నవంబరు 203 వ సంవత్సరం , రోహిణి నక్షత్రం – ఫరంగిపేట గ్రామం లో ఒక నంబూద్రి బ్రాహ్మణుడైన అర్చకునికి మగ శిశువు జన్మించినాడు. తల్లిదండ్రులు ఇతనికి నాగరాజు అని పేరు పెట్టినారు . ఇతనికి ఒక చెల్లెలు కుడా జన్మించినది ఆమెకు నాగలక్ష్మి అని పేరు పెట్టారు. నాగరాజునకు ఐదు సంవత్సరాల వయసులో ఆ దేవాలయం లో పెద్ద ఉత్సవం జరిగి ఆ ఉత్సవం లో ఒక వ్యక్తి నాగరాజును అపహరించి తీసుకు వెళ్లి కలకత్తా లో ఒక ధనవంతుల ఇంట్లో బానిసగా అమ్మేసాడు.
ఆ ఇంటి యజమానికి చాలా దైవభక్తి ..,ఎప్పుడూ ఇంట్లో పూజలు జరుగుతూ ఉండేవి . ఇవన్నీ చూసిన నాగారాజునకు విచారణ , దైవభక్తి బాగా అలవడ్డవి.కొన్నాళ్ళకు బానిసతనం నుండి ఆ పిల్లవాడిని యజమాని విడిచిపెట్టినాడు. బయటి ప్రపంచానికి వెళ్ళిన నాగరాజుకు ఒక సాధువుల బృందం ఎదురుపడింది, వారితో నాగరాజు వెళ్ళి బ్రతుకుతూ వారికి సేవ చెయ్యడం ప్రారంభం చేసాడు.
వారు ఆ బాలుని సేవకి మెచ్చి సకల పురాణములను ఐతేహాసములను వివరించి గొప్ప పండితుణ్ణి చేసినారు ..విద్యాగోష్టిలల్లో ఆరితేరినా ఆధ్యాత్మికా తృష్ణ తీరలేదు ..కేవలం పాండిత్యం తో భగవానుడు ప్రత్యక్షం కాడు, దివ్యజ్ఞానం మరియు సిద్ధి కలుగదు కదా అని విచారిస్తూ ఉన్నాడు.ఒకసారి సాధువులతో కాశి వెళ్ళాడు …అక్కడినుండి శ్రీలంక చేరుకున్నాడు. అక్కడ సుబ్రమణ్యస్వామి దేవాలయం లో స్వామివారు సుబ్రమణ్యయంత్రము గ పూజలు అందుకోవడం చూసాడు , ఈ క్షేత్రం ‘కతిర్గామ’. ఇక్కడే సుబ్రమన్యుడు వల్లీదేవిని వివాహం చేసుకున్నాడు .

Related:   ఆర్మీ జెనెరల్

.

ఈ దేవాలయం లో వటవృక్షం క్రింద భోగానాధుడు అనే సిద్ధపురుషుడు నాగరాజుకు సాక్షాత్కరించాడు.అక్కడే ఉండి నాగరాజు ఆరు నెలలు కదలకుండా ధ్యానం చేసాడు.దీర్ఘ కాలం సమాధి స్థితి లో ఉండగా సుబ్రమణ్య స్వామి సాక్షాత్కారం జరిగింది.ఆయన తేజస్సు తనలోకి ప్రవేశించడం గమనించాడు నాగరాజు.ఆపై మరల భోగనాధుడు ఇలా ఆదేశించాడు ….” సాధన పరిపూర్ణము కావాలంటే ద్రవిడ దేశం లో కుర్తాలం లో అగస్త్యుడు ఉన్నాడు అతని అనుగ్రహం పొందాలి అప్పుడు సిద్ధి పొందగలవు అని ఆదేశించాడు ……..

.

నాగరాజు బయలుదేరి కుర్తాలం వచ్చి ,అగస్తుని గూర్చి తీవ్ర తపస్సు చేసాడు , అన్నపానాలు మాని 47 రోజులు జపము ,ధ్యానము చెయ్యగా అగస్త్యుడు ప్రత్యక్షమై దివ్య ప్రసాదమును తన చేతులమీదుగా తినిపించి ,యోగ విద్య లో రహస్యాలు తెలిపి సిద్ధిని అనుగ్రహించాడు ..అగస్త్యుని దివ్యానుగ్రహం తో నాగరాజు ‘ మహా అవతార్ బాబా’ గ పరిణామం చెందాడు..

Related:   Puneeth Rajkumar Movies | Puneeth Rajkumar Non Stop Punching Action Scenes | Ranavikrama Movie

.

గమనించవలసిన సత్యం ఏమిటంటే ఇక్కడి నుండి బయలుదేరి బదిరికశ్రమం లో గురువులు ఉపదేశం మేరకు సాధనలు చేసి నిత్య యవ్వనునిగా , అమరునిగా మారినాడు అవతార్ మహా బాబా . క్రీస్తు శకం 788 -820 మధ్య బ్రతికిన ఆదిశంకరాచార్యకు సన్యాస దీక్ష ఇచ్చినవారు గోవింద భగవత్పాదులు కాగా యోగ దీక్ష ఇచ్చినది మహా అవతార్ బాబా. కేదారనాద్ పర్వత శిఖర ప్రాంతం లో ఉన్న సిద్దాశ్రమానికి శంకరులు వెళ్లాలని ప్రయత్నము చెయ్యగా వీలుకాకపోతే అప్పుడు మహావతార్ బాబా కొన్ని యోగ సాధనలు వారితో చేయించగా అప్పుడు శంకరులు వెళ్ళగలిగారు అని యోగులు , పెద్దలు చెప్తుంటారు.

.

ఇట్లా సిద్ధాశ్రమ యోగులు కేదార్ ప్రాంతం లో అతి రహస్యంగా ఉంటూ మానవ జాతికి అవసరమైన శుభాలు చెస్తూ ఉంటారు.ఉత్తమ సంస్కారం కలిగిన విశిష్ట వ్యక్తులల్లో ప్రవేశించి మానవాళికి మంచి చేస్తూ ఉంటారు. హిందూ ధర్మం కాపాడేవారిల్లోకి దివ్య యోగులు ప్రవేశించి మానవాళికి శుభం చేస్తున్నారని కొంతమంది ధ్యానయోగులు చెప్పి ఉన్నారు. సిద్ధాశ్రమ యోగులే రమణ మహర్షి ,అరవింద యోగి ,కావ్యకంట గణపతి ముని అని ధ్యాన యోగులు చెప్తున్నారు. ..

Related:   Budget 2018-19 వ్యవసాయరంగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *