మిర్చీ కా సాలన్‌

• మిర్చీ కా సాలన్‌
కావల్సినవి: పెద్దమిర్చీ – ఐదారు, నూనె – రెండు చెంచాలు, చింతపండు రసం – చెంచా, ఉప్పు – తగినంత, కారం – అరచెంచా, పసుపు – పావుచెంచా, గరంమసాలా, ధనియాలపొడి, జీలకర్రపొడి – అరచెంచా చొప్పున, టొమాటో – ఒకటి, ఉల్లిపాయలు – మూడు, వెల్లుల్లిరెబ్బలు – రెండు, అల్లం – చిన్న ముక్క, పల్లీలు – గుప్పెడు, నువ్వులు – చెంచా, లవంగాలు – నాలుగు, దాల్చినచెక్క – చిన్న ముక్క, యాలకులు – మూడు, బిర్యానీ ఆకు – ఒకటి, అనాసపువ్వు – ఒకటి.
తయారీ: ముందుగా టొమాటో, ఉల్లిపాయ ముక్కలూ, వెల్లుల్లిరెబ్బలూ, అల్లం, వేయించిన పల్లీలూ, నువ్వులూ, లవంగాలూ, దాల్చినచెక్కా, యాలకులూ, బిర్యానీ ఆకూ, అనాసపువ్వు కుక్కర్‌లో తీసుకుని కాసిని నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. మూడునాలుగు కూతలు వచ్చాక దింపేయాలి. తరవాత బిర్యానీ ఆకు తీసేసి మెత్తని ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పసుపూ, కారం, మిర్చీ వేసి బాగా వేయించాలి. అవి వేగాయనుకున్నాక ముందుగా చేసుకున్న టొమాటో మసాలా, చింతపండు రసం, తగినంత ఉప్పూ,, గరంమసాలా, ధనియాలపొడీ, జీలకర్ర పొడి వేసి మంట తగ్గించాలి. ఇది దగ్గరకు అయ్యాక దింపేయాలి.

READ:   కంది కట్టు

Originally posted 2019-03-23 08:23:30.