ముంబై, బ్యాంకాక్ బీచ్ అంటూ ట్వీట్.. డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే?.. మెగాస్టార్ టైమింగ్‌కు ఫిదా


గ్రాండ్ ఎంట్రీ..

తెలుగు వారికి మొదటి పండుగ అయిన ఉగాది నాడు చిరంజీవి సోషల్ మీడియా ప్రపంచంలోకి ప్రవేశించాడు. తన భావాలను, ఆలోచనలను పంచుకోవడానికి ఈ మాధ్యమం ఎంతగానో ఉపయోగపడుతుందని అందుకే ఎంట్రీ ఇస్తున్నానని చెప్పి.. అదిరిపోయేలా రంగ ప్రవేశం చేశాడు. వస్తూనే ట్వీట్లతో అదరగొట్టేశాడు.

మొదటి ట్వీట్ అదే..

మొదటి ట్వీట్ అదే..

ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. మొదటి ట్వీట్‌గా ఉగాది శుభాకాంక్షలు తెలిపాడు. ఆపై కరోనాపై అవగాహన, కరోనా కట్టడికి ప్రధాని, సీఎంలు తీసుకున్న నిర్ణయాలను సమర్థించాడు. ఆపై ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌పై కామెంట్ చేశాడు.

READ:   ఆ ఫొటోలపై స్పందించిన ఇవాంక ట్రంప్.. సాయి తేజ్ ఫిదా

సెలెబ్రిటీల విషెస్..

చిరు ఎంట్రీపై సెలెబ్రిటీలందరూ స్పందించారు. ట్విట్టర్ ప్రపంచంలోకి స్వాగతమంటూ చిరును ఆహ్వానించారు. ఈ కమ్రంలో పూరీ జగన్నాథ్ స్పందిస్తూ… సర్‌ర్‌ర్.. సోషల్ మీడియాకు స్వాగతం.. సామాజిక దూరాన్ని పాటించే ఈ సమయంలో.. మీరు సోషల్ మీడియాలోకి రావడంతో మరింత దగ్గర అవ్వొచ్చని ట్వీట్ చేశాడు.

ముంబై బీచ్, బ్యాంకాక్..

పూరి జగన్నాథ్ ట్వీట్‌కు చిరు స్పందిస్తూ.. స్వాగతించినందుకు ధన్యవాదాలు.. ఇది మన ఫ్యామిలీతో సమయాన్ని గడిపే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది.. నువ్వైతే.. ముంబై, బ్యాంకాక్ బీచ్‌లు మిస్ అవుతావేమో గానీ, నువ్వు ఇంట్లోనే ఉండటంతో పవిత్ర, ఆకాష్ మాత్రం కచ్చితంగా సంతోష పడుతారని అన్నాడు.

READ:   జుట్టుకు కెరాటిన్ చికిత్స అంటే ఏమిటి మరియు దాని దుష్ప్రభావాలు ఏమిటి?
-->

Pawan Kalyan & Trivikram Huge Donation To PM Releif Fund , TS & AP Government

మీమ్స్ హల్చల్..

మీమ్స్ హల్చల్..

చిరు ట్వీట్‌కు పూరి రిప్లై ఇస్తూ లవ్యూ అన్నయ్య అని పోస్ట్ చేశాడు. అయితే వీరిద్దరి కన్వరేజషన్‌పై మీమ్స్ మాత్రం హల్చల్ చేస్తున్నాయి. అందులోని ఓ మీమ్‌ను పూరి జగన్నాథ్ కూడా లైక్ చేశాడు. నరసింహా సినిమాలోని నిశ్చితార్థానికి వెళ్లే సీన్‌తో ఈ టాపిక్‌ను కలిపి చేసిన ఆ మీమ్ బాగానే వైరల్ అవుతోంది. మెగాస్టార్ టైమింగ్, ఆయన ఫ్లోను చూసిన నెటిజన్స్.. ఇన్నాళ్లు చాలా మిస్ అయ్యామని కామెంట్స్ చేస్తున్నారు.

READ:   7 ఏళ్ల వయసులో తప్పిపోయాడు 27 ఏళ్లకి ఇంటిక వచ్చాడు తల్లి ఏం చేసిందంటే - All Time Report