ముఖం మీద రంద్రాలను తొలగించుకోవడానికి పాక్స్

0
157

*ముఖం మీద రంద్రాలను తొలగించుకోవడానికి పాక్స్*

జిడ్డు చర్మం కలిగిన వారి ముఖం మీద రంద్రాలు చాలా పెద్దవిగా కన్పిస్తాయి. వాటి చికిత్స మరియు తగ్గించటానికి అనేక రకాల పద్దతులు ఉన్నాయి. రంద్రాలను తగ్గించి చర్మాన్ని బిగుతుగా చేయటానికి అనేక రకాల ఉత్పత్తులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కానీ మన ఇంటిలో సులభంగా దొరికే సహజమైన పదార్దాలతో పెద్ద రంద్రాలను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

నిమ్మరసం మరియు బాదం
ఒక బౌల్ లో నీటిని పోసి దానిలో బాదం వేసి రాత్రి సమయంలో నానబెట్టాలి. మరుసటి రోజు నానిన బాదంను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

*నిమ్మరసం మరియు తెల్లసొన*
గుడ్డు తెల్లసొనలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మాన్ని బిగుతుగా ఉంచటమే కాక, మృత కణాలను మరియు అధికంగా ఉన్న నూనెను తొలగిస్తుంది.

Also READ:   Organic Total Body Reboot

దోసకాయ, నిమ్మకాయ మరియు రోజ్ వాటర్
దోసకాయను ముక్కలుగా కోసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ రోజ్ వాటర్, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంలో ఒక కాటన్ బాల్ ముంచి ముఖం మీద వేసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి.

*తల మీద చర్మం మీద మొటిమలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు*
మొటిమలు అనేవి శరీరం, తల మీద చర్మం మరియు శరీరం యొక్క అనేక బాగాలపై కనపడతాయి. ఈ సమస్య వయస్సుతో నిమిత్తం లేకుండా అందరిలోనూ కనపడుతుంది.జుట్టు మీద చనిపోయిన చర్మ కణాలు మరియు సిబం కలిసి తల మీద చర్మం మీద చర్మ రంద్రాలను మూసివేయటం వలన మొటిమలు ఏర్పడతాయి. ఈ మొటిమలను తగ్గించుకోవటానికి ఎన్నో ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Also READ:   మోకాళ్ళ నొప్పులు 

*తమలపాకు*
తమలపాకులో యాంటీమైక్రోబయాల్ మరియు క్రిమినాశక లక్షణాలు ఉండుట వలన మొటిమల చికిత్సలోసమర్ధవంతంగా పనిచేస్తుంది.

తమలపాకులను పేస్ట్ చేసి ప్రభావిత ప్రాంతంలో రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేయాలి.
రాత్రి పడుకొనే ముందు వెచ్చని తమలపాకును ప్రభావవంతమైన ప్రాంతంలో పెట్టి,మరుసటి రోజు శుభ్రం చేసుకోవాలి. రెండు లేదా మూడు కప్పుల నీటిలో మూడు లేదా ఐదు తమలపాకులను వేసి ఉడికించాలి. ఈ ద్రవం చల్లారిన తర్వాత వడకట్టి జుట్టును శుభ్రం చేయటానికి ఉపయోగించాలి.
*తేనె*
యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టిరియాల్ లక్షణాలు ఉండుట వలన మొటిమలను కలిగించే బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకోవటం మరియు ఎరుపు,
వాపును సమర్ధవంతంగా తగ్గిస్తుంది.ప్రభావిత ప్రాంతంలో తేనెను రాసి పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రతి రోజు ఈ విధంగా రెండు సార్లు చేయాలి. ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిలో రెండు స్పూన్ల తేనెను కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం మి నవీన్ నడిమింటి
9703706660

Also READ:   Remedies to Increase Sperm Count

Please View My Other Sites

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here