ముద్దు మంచిదే

Spread the love

ముద్దు మంచిదే..!

‘ము..ము..ము.. ముద్దంటే చేదా..
నీకా ఉద్దేశం లేదా?’ అంటూ ఓ పాత సినిమాలో పాట పాడుతుంది వాంప్. సినిమాలో సంగతేమో తెలియదుకానీ, నిజ జీవితంలో మాత్రం ముద్దు మంచిదేనట. అంటే మనుషులు ఆరోగ్యంగా ఉండటానికి ముద్దు దోహదపడుతుందట. అన్నిటిలోనూ ‘ఫ్రెంచ్‌కిస్’ అని పిలిచే ముద్దు వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also READ:   PSORIASIS

ఫ్రెంచ్‌కిస్ ద్వారా లాలాజలం ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుందని, తద్వారా యాంటీబాడీస్ తయారై శరీరంలో చెలరేగిపోయే హానికారక బ్యాక్టీరియా అంతు చూస్తాయని వారు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఎక్కువ సేపు ముద్దు పెట్టుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉందట. ఆ సమయంలో మెదడు ఉత్తేజితమై ఆనందానికి కారణమయ్యే ఎండోర్ఫిన్‌ను, ఫీల్‌గుడ్ రసాయనమైన ఆక్సిటోసిన్‌ను విడుదల చేస్తుందట.

Updated: July 14, 2019 — 12:58 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *