మెంతులతోమేలు

#మెంతులతోమేలు

మెంతులు రుచిలో చేదుగా ఉన్నా చక్కని సువాసనతో ఔషధగుణాలను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. దీనిలో అధిక మోతాదులో మినరల్స్, విటమిన్లు, ఫైటోన్యూట్రియంట్స్ లభిస్తాయి. వందగ్రాముల మెంతుల్లో మూడువందల ఇరవై మూడు కెలొరీలు ఉంటాయి. శరీరంలో త్వరగా కరిగేపోయే పీచు దీనిలో ఎక్కువగా లభిస్తుంది. దీనిలో ఉండే కాంపౌడ్స్ అయిన మ్యుకిలేజ్, టానిన్, హెమీసెల్యులోజ్, పెక్టిన్ వంటివి రక్తంలోని ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి వూపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. అలానే దీనిలో లభించే నాన్‌స్టార్చ్ పోలీశాచిరైడ్స్ జీర్ణప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడటమే కాకుండా మలబద్ధకాన్ని నివారిస్తుంది.

READ:   మీరు కాఫీని ఇష్టపడుతున్నారా?రోజుకు మూడు కప్పుల కాఫీ మధుమేహం నుండి మిమ్మల్ని కాపాడుతుంది

Originally posted 2018-04-03 07:43:30.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *