Home Bhakti యాదగిరిగుట్ట క్షేత్రం లోని విష్ణు పుష్కరిణి ప్రత్యేకత

యాదగిరిగుట్ట క్షేత్రం లోని విష్ణు పుష్కరిణి ప్రత్యేకత

- Advertisement -

యాదగిరిగుట్ట క్షేత్రం లోని విష్ణు పుష్కరిణి ప్రత్యేకత .
**********************************************

శ్రీమహావిష్ణువు హిరణ్యకశిపుడిని నరసింహస్వామి అవతారంలో సంహరించిన అనంతరం, యాదమహర్షికి ఇచ్చిన మాట మేరకు ఆ స్వామి లక్ష్మీసమేతుడై ఇక్కడ ఆవిర్భవించాడు.అప్పుడు ఇంద్రాది దేవతలు స్వామిని స్తుతిస్తూ ఆయన దర్శనం చేసుకున్నారు.అప్పుడు పరమశివుడు,. బ్రహ్మదేవుడు స్వామివారి పాదాలను కడుగుతారు. అలా వారు స్వామి పాదాలను కడిగిన నీటితోనే ఈ పుష్కరిణి ఆవిర్భవించిందని చెబుతుంటారు. అందువల్లనే దీనిని విష్ణు పుష్కరిణిగా పిలుస్తుంటారు.విష్ణు పుష్కరిణి అనే పేరులోనే పవిత్రత దాగివుంది. అలాంటి పుష్కరిణిలోని నీటిని తలపై చల్లుకుంటే చాలు అనిపిస్తుంది. అలంటి విష్ణు పుష్కరిణి నల్గొండ జిల్లా యాదగిరి గుట్ట క్షేత్రంలో దర్శనమిస్తుంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి స్వయంభువుగా కొలువై భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. నరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రాల్లో ఒకటిగా ఇది చెప్పబడుతోంది.

ఇక్కడి స్వామివారికి ప్రదక్షిణలు చేసి .. నిద్రచేయడం వలన వివిధ రకాల దోషాల వలన .. దుష్ట ప్రయోగాల వలన కలిగిన అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అలాంటి ఈ క్షేత్రంలో స్వామివారి ఆవిర్భావకాలం నుంచే వున్నదిగా విష్ణు పుష్కరిణి కనిపిస్తుంది.అలాంటి ఈ పుష్కరిణి లోని నీటిని తలపై చల్లుకోవడం వలన సమస్త పాపాలు .. దోషాలు .. దుఃఖాలు .. భయాలు దూరమైపోయి సంతోషకరమైన జీవితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

Originally posted 2019-02-26 08:11:10.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

మొక్కజొన్న కర్రీ 

• మొక్కజొన్న కర్రీ కావల్సినవి: లేత మొక్కజొన్న - ఒకటి (ముక్కల్లా కోయాలి), ఉడికించిన స్వీట్‌కార్న్‌ - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, కరివేపాకు -...
- Advertisement -

అందంగా జుట్టు పెరగడానికి : ఉసిరికాయ పౌడర్ | How to Use Amla Powder For Hair Growth

ఉసిరికాయ పొడితో జుట్టు సంరక్షణ తలపై పేలవమైన ఆరోగ్యం చాలా జుట్టు సమస్యలకు దారితీస్తుంది. కానీ మీ జుట్టుకు ఉసిరికాయను...

Related News

మొక్కజొన్న కర్రీ 

• మొక్కజొన్న కర్రీ కావల్సినవి: లేత మొక్కజొన్న - ఒకటి (ముక్కల్లా కోయాలి), ఉడికించిన స్వీట్‌కార్న్‌ - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, కరివేపాకు -...

అందంగా జుట్టు పెరగడానికి : ఉసిరికాయ పౌడర్ | How to Use Amla Powder For Hair Growth

ఉసిరికాయ పొడితో జుట్టు సంరక్షణ తలపై పేలవమైన ఆరోగ్యం చాలా జుట్టు సమస్యలకు దారితీస్తుంది. కానీ మీ జుట్టుకు ఉసిరికాయను...

కరోనా వైరస్ ప్రభావం నుండి కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిపై వైరస్ మళ్లీ దాడి చేస్తుందా? వాస్తవం ఏమిటి?

తిరిగి రావచ్చు అంతకుముందు, కోరోనావైరస్ కోలుకున్న వారికి వ్యాపించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సంక్రమణ తక్కువగా ఉన్న తరువాతి 2 వారాలకు ఐసోలేషన్ అవసరమని చెబుతారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here