రచ్చ రచ్చ చేసిన ప్రముఖ నటుడిని నడిరోడ్డుపై చితక్కొట్టిన స్థానికులు

0
12


bredcrumb

Kannada Movies

oi-Manojkumar P

|

సినిమా నటులంటే భారతదేశంలో ఎంతో గౌరవం ఉంటుంది. ఇక్కడ అంతగా వాళ్లను అభిమానిస్తూ ఉంటారు. సినిమా విడుదలైతే స్వీట్లు పంచడం, క్షీరాభిషేకాలు చేయడం, రక్తాభిషేకాలు చేయడం వంటి గతంలో ఎన్నో చూశాం.. ఇప్పుడు కూడా చూస్తున్నాం. చాలా చోట్ల తమకు నచ్చిన వారి కోసం గుళ్లు కట్టించిన సంఘటనలూ మనం చూశాం. ఇంతటి సినిమా పిచ్చ ఉన్న వాళ్లు ఉన్నారిక్కడ. ఇది దక్షిణాదిలో మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ, తాజాగా జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

Also READ:   Ram charan: ఇంత అన్యాయమా.. రామ్ చరణ్ ఆఫీసు ముందు ‘ఉయ్యాలవాడ’ వారి ధర్నా - uyyalawada narasimhareddy family protests infront of ram charan’s office

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన హుచ్చా వెంకట్ అనే నటుడు కర్ణాటకలోని కొడుగు జిల్లా నాపోక్లు గ్రామంలోని ఓ రిసార్టుకు వచ్చాడు. దీంతో అందరూ అతడిని చూస్తూ ఉండిపోయారు. స్థానికులు అతడిని అలా చూస్తుండడంతో వెంకట్ రెచ్చిపోయాడు. ఏమైందో ఏమో దిలీప్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్లి ‘నన్ను ఎందుకు చూస్తున్నావ్’ అని ప్రశ్నించాడు. దీంతో అతడు ‘మీరు వెంకట్ కదా’ అని సమాధానం ఇచ్చాడు. ఆ వెంటనే దిలీప్‌ను వెంకట్ చెంపపై కొట్టాడు.

Also READ:   హీరో నితిన్ పెళ్లి వివరాలు లీక్: అమ్మాయి పేరు.. మ్యారేజ్ డేట్.. వేదిక ఫిక్స్ అయిపోయాయి.!

Please View My Other Sites

 Kannada Actor Huccha Venkat brutally thrashed by unruly crowd

అంతటితో ఆగకుండా అతడిపై దాడికి దిగాడు. అదే సమయంలో పక్కనే ఉన్న దిలీప్ కారును కూడా ధ్వంసం చేశాడు. ఈ పరిణామంతో షాక్‌కు గురైన స్థానికులు అందరూ కలిసి వెంకట్‌ను నడి రోడ్డుపైనే చితక్కొట్టారు. అంతేకాదు, ఆయనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని వెంకట్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Also READ:   శ్రీదేవి వర్ధంతి: అమ్మా.. ప్రతీ రోజూ మిస్ అవుతున్నాం.. నీవు లేని లోటు.. జాహ్నవి భావోద్వేగం

బిగ్‌బాస్ కన్నడ 3 షో ద్వారా వెంకట్ పాపులర్ అయ్యాడు. ‘హుచ్చ వెంకట్’,’తిక్ల’ అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించడమే గాక.. తానే హీరోగా నటించాడు. వెంకట్ వివాదాలతో వార్తల్లోకి ఎక్కడం ఇదే కొత్త కాదు. గతంలోనూ పలు కేసుల్లో వార్తల్లోకి ఎక్కాడు. దీంతో అతడి పేరు మరోసారి మారుమ్రోగిపోతోంది.