రజినీకాంత్‌పై కేసు నమోదు.. చిక్కుల్లో పడిన సూపర్ స్టార్

0
8


తుగ్లక్ 50వ వార్షికోత్సవం.. రజినీ కామెంట్స్

తుగ్లక్ 50వ వార్షికోత్సవం.. రజినీ కామెంట్స్

జనవరి నెల 14న చెన్నైలో ఏర్పాటు చేసిన తమిళ మేగజైన్ తుగ్లక్ 50వ వార్షికోత్సవ వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెరియార్ గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 1971లో పెరియార్.. రాముడు,సీతల విగ్రహాలకు చెప్పుల దండవేసి ఊరేగించారని అన్నారు. మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సాలెంలో ఏర్పాటు చేసిన ఓ సదస్సులో భాగంగా పెరియార్ అలా చేశారని చెప్పుకొచ్చారు.

Also READ:   విడాకుల కోసం స్టార్ దంపతులు.. సోషల్ మీడియాలో బయటపడ్డ విభేదాలు
-->

 రజినీకాంత్ క్షమాపణలు చెప్పాలి

రజినీకాంత్ క్షమాపణలు చెప్పాలి

రజినీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు మండిపడుతున్నారు. పెరియార్‌ గురించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ అధ్యక్షుడు మణి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజినీకాంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

 రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ తరుణంలో

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ తరుణంలో

మణి ఫిర్యాదు మేరకు పోలీసులు రజినీకాంత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రజనీ.. రాజకీయ ప్రవేశం కోసమే పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మణి. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ తరుణంలో రజినీకాంత్ ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.

Also READ:   Adithya Varma Release Postponed: తమిళ `అర్జున్‌ రెడ్డి`కి తీరని కష్టాలు.. రిలీజ్‌ మరోసారి వాయిదా! - arjun reddy tamil remake adithya varma release date postponed
-->

 రజినీకాంత్ దర్బార్

రజినీకాంత్ దర్బార్

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సంవత్సరానికి కిక్ స్టార్ట్ ఇచ్చారు. తన తాజా సినిమా ‘దర్బార్’తో వసూళ్ల ప్రవాహం పారించారు. జనవరి 9న విడుదలైన ఈ సినిమా తమిళనాడు, ఓవర్సీస్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కుమ్మేసింది. రజినీ స్టైల్‌కి తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.

సరికొత్త ఫీట్స్.. సంబరాల్లో అభిమానులు

సరికొత్త ఫీట్స్.. సంబరాల్లో అభిమానులు

తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దర్బార్ హవా నడుస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. నేటికీ ఈ సినిమా కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది.

Also READ:   మూడు రాజధానులపై నందమూరి ఫ్యామిలీ క్లారిటీ.. - All Time Report