రష్మికకు భారీ షాక్ ఇచ్చిన మాజీ ప్రియుడు.. ఒకే ఒక్క మాటతో తేల్చేసిన స్టార్ హీరో.!


అది ఎలా ఉన్నా.. రష్మికకు మాత్రం తిరుగులేదు

రష్మిక మందన్నా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తోంది. ‘ఛలో’ మూవీని మొదలుకొని ఆమె ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో ‘దేవదాస్’, ‘డియర్ కామ్రేడ్’ రూపంలో పరాజయాలనూ అందుకుంది. అయినప్పటికీ రష్మిక నటనలో తిరుగులేదు అనిపించుకుంటోంది.

మెగా హీరోతో రొమాన్స్.. తారక్ చాయిస్ ఆమె

మెగా హీరోతో రొమాన్స్.. తారక్ చాయిస్ ఆమె

వరుస విజయాలతో దూసుకుపోతోన్న రష్మిక.. తెలుగులో బడా హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే ఆమె అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు ఎంపిక కాగా.. త్రివిక్రమ్ – జూనియర్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమాలో ఫస్ట్ చాయిస్‌గా నిలిచింది. తారక్ మాత్రం రష్మికకే ఎక్కువ మార్కులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

READ:   రాహు సినిమా మా నమ్మకం నిలబెట్టింది - రాహు నిర్మాత ఏ.వి.ఎస్.ఆర్ స్వామి - Pakka Filmy - Telugu
-->

 ప్రముఖ హీరోతో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చింది

ప్రముఖ హీరోతో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చింది

సినిమాల పరంగా దూసుకుపోతోన్న రష్మిక మందన్నా.. వ్యక్తిగత జీవితం విషయంలో పలుమార్లు వార్తల్లోకి ఎక్కింది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతున్న ఓ యంగ్ హీరోతో ఆమె ప్రేమాయణం సాగిస్తోందని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఖండిస్తూ సదరు హీరోతో పాటు ఆమె కూడా పలుమార్లు క్లారిటీ ఇచ్చింది.

 మాజీ లవర్‌తో మళ్లీ కలుస్తున్న రష్మిక మందన్నా

మాజీ లవర్‌తో మళ్లీ కలుస్తున్న రష్మిక మందన్నా

వాస్తవానికి రష్మిక మందన్నా తన మొట్టమొదటి కో స్టార్, కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. అంతేకాదు, వీళ్లిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఏమైందో ఏమో కొద్ది రోజులకే తమ బంధానికి బ్రేకప్ చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే రక్షిత్ శెట్టితో రష్మిక మరోసారి కలవబోతుందని ఈ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

READ:   గుండె పగిలే అంటూ కత్రినా కైఫ్ భావోద్వేగం.. ప్రధానికి విరాళం ఎంతంటే (వీడియో)
-->

 వాళ్లిద్దరూ కలిసేది అందుకే.. నిజమేననుకున్నారు

వాళ్లిద్దరూ కలిసేది అందుకే.. నిజమేననుకున్నారు

రష్మిక మందన్నా.. రక్షిత్ శెట్టి కలిసేది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో మాత్రమే. గతంలో వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘కిర్రాక్ పార్టీ’కి కొనసాగింపుగా ఓ సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని ఆ హీరోనే ట్విట్టర్ వేదికగా స్వయంగా వెల్లడించాడు. దీంతో ఈ సినిమా మొదటి భాగంలో రష్మిక హీరోయిన్ కావడంతో.. రెండో భాగంలోనూ ఆమెనే తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

READ:   బిగ్ బ్రేకింగ్...మెహ‌రీన్ ని ఇబ్బంది పెట్టిన హీరో తండ్రి - All Time Report
-->

Sarileru Neekevvaru @50 Days | Mahesh Babu Emotional Tweet

రష్మికకు భారీ షాక్ ఇచ్చిన మాజీ ప్రియుడు

రష్మికకు భారీ షాక్ ఇచ్చిన మాజీ ప్రియుడు

‘కిర్రాక్ పార్టీ 2′ గురించి తాజాగా రక్షిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అందరూ అనుకుంటున్నట్లు ‘కిర్రాక్ పార్టీ’ సీక్వెల్‌లో రష్మిక హీరోయిన్ కాదు. ఆమె స్థానంలో మరో కొత్త హీరోయిన్‌ను తీసుకుంటున్నాం’ అని వివరించి షాకిచ్చాడు. వాస్తవానికి యూనిట్ మాత్రం రష్మికను తీసుకుందామని భావించినా అతడే కావాలని అడ్డుకున్నాడని ప్రచారం జరుగుతోంది.