రాగి నీటితో లక్షలు కాపాడుకొనే చిట్కాలు

Spread the love

రాగి నీటితో లక్షలు కాపాడుకొనే చిట్కాలు!!

రాగి పాత్రలోని మంచినీటి గురించి అమొగమైన విషయాలు మీ కోసం:

* జీర్ణ వ్యవస్థకు మంచిది: రాగి పాత్రలో నీలు తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటివి తగ్గడం కాకుండా, , మీ కడుపుకి హాయి కలిగించి, ప్రాణాంతకరమైన బాక్టీరియాను కూడా నిర్మూలిస్తుంది. కిడ్నీ ఇంకా లివర్ చురుకుగా పనిచేయడంలో తోడ్పడుతుంది.

* బరువు తగ్గిస్తుంది: మనం అధిక బరువు తగ్గడానికి రకరకాల పండ్లు, కూరగాయలు వంటివి తింటూ ఉంటాం. కాని వాటివల్ల వచ్చే ప్రయోజనాలకన్న, వాటికి ఖర్చుపెట్టిన డబ్బు వ్యర్ధం అయిందన్న దిగులే ఎక్కువ. రాగి పాత్రలో నీలు తాగడం వల్ల అది మీ జీర్ణ వ్యవస్థను సరైన మార్గంలో నడిచేలా చేసి, కొవ్వు మరియు ఇతర చెడు బాక్టీరియాను శరీరంనుండి తీసేస్తుంది.

Also READ:   The AutoImmune Bible

* గాయాలను త్వరగా నయం చేస్తుంది: రాగిలో ఉండే యాంటి-బాక్టీరియా తత్వం శరీరంలోని అనేక గాయాలను వేగంగా నయం చేయడంతోపాటు రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరిచి, శరీరంపై ఉన్న గాయాలనే కాకుండా లోపల ఉన్న గాయాలను, ముఖ్యంగా కడుపులో ఉన్న గాయాలను కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది.

* మీ వయసును దాచేస్తుంది: కొంతమంది ఆరోగ్య పరంగా ఎంత చురుకుగా ఉన్నా వారి వయసు మించి కనిపిస్తూ ఉంటారు. ఈ సమస్య నుండి బాధ పడేవారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు రాగి నుండి ఉత్పత్తి అయ్యే ప్రయోజనాలతో వారి సమస్య నుండి విముక్తి చెందగలరు. ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలు వంటివి రాగి తగ్గిస్తుంది.

* క్యాన్సర్ వ్యాధి నుండి పోరాడుతుంది: రాగిలో ఉండే అనామ్లజనకాలు (యాంటి-ఆక్సిడెంట్) క్యాన్సర్ వంటి ప్రాణాంతకరమైన రోగాల నుండి కాపాడుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వారు చేసిన పరిశోధనాల ప్రకారం రాగి క్యాన్సర్ ను ఎలా రానివ్వకుండా చేస్తుందో కనుగొనలేకపోయారు. కాని రాగి నిరంతరం క్యాన్సర్ వ్యాపింపజేసే వైరస్ ను అడ్డుకోనడంలో తోడ్పడుతుందని ఆ పరిశోధనల్లో తేలింది.

Also READ:   పంచదార అనేది ఒక విషపదార్దము

* మెదడును మెరుగుపరుస్తుంది: మన శరీర భాగంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి మెదడు. మనిషి శరీరంలో ప్రతీ ఒక్క భాగానికి మెదడుతో సంబంధాలు కలిగి ఉంటాయి. మెదడు నుండి ఆయా భాగాలకు న్యురాన్ల ద్వారా సంకేతాలు అందుతాయి. ఈ న్యురాన్లను మైలిన్ తొడుగు కాపాడుతుంది.  రాగిలో ఉండే విలువైన పదార్థాలు ఈ మైలిన్ తొడుగును కపాడంతోపాటు, మెదడును చురుకుగా, యవ్వనంగా తయారు చేస్తుంది.

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి ప్రకారం రాగిని రోజుకు 12మి.గ్రా కన్నా ఎక్కువ తీసుకునే అవసరం లేదు అంటే రాగి పాత్రలో కనీసం 8 గంటలు ఉంచిన మంచి నీటిని రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకుంటే సరిపోతుంది. రాగి సర్వ రోగ నివారిణిగా పనిచేసి మనిషికి ఆరోగ్యాని ప్రసాదిస్తు, డాక్టర్లకు పెట్టె లక్షల ఖర్చును మిగిలిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also READ:   Driving Fear Program - High Conversions & Huge Commissions!

రాగి పాత్రని సబ్బుతో కాకుండా సగం కోసిన నిమ్మ చెక్కతో లేదా వంట సోడాతో రుద్ది నీటితో కడిగితే సరిపోతుంది.

Updated: March 16, 2019 — 10:34 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *